Raghava Lawrence | పది ట్రాక్టర్లు ఉచితంగా పంచిన రాఘవ లారెన్స్.. నిజంగా గ్రేట్

Raghava Lawrence |డబ్బు చాలా మంది సంపాదిస్తారు. కాని పేదలకు పంచి పెట్టడం, అవసరాల్లో ఉన్న వారికి ఆర్ధిక సాయం చేసి ఆదుకోవడం అనేది మాత్రం కొందరు మాత్రమే చేస్తారు. ఈలిస్టులో చేరిన అతి తక్కువ మంది నటుల్లో డైరెక్టర్ కమ్ హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ చేరిపోయాడు. తమిళనాడులోని విలుపురం జిల్లాకు చెందిన ఓపేద రైతు బాధను చూసిన లారెన్స్ తన సొంత డబ్బుతో 10మంది రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు పంపిణి చేస్తానని మాటిచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ముందుగా విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ అనే రైతు కుటుంబానికి తొలి ట్రాక్టర్ ను తానే స్వయంగా ఇంటికి వెళ్లి అందజేశాడు.నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు కష్టపడి తమ టాలెంట్ తో పైకి వచ్చిన వాళ్లే ఉన్నారు. అయితే ఓ స్థాయికి చేరుకున్న తర్వాత తమ పొజిషన్ కాపాడుకునేందుకు లేదంటే ఎక్కువ డబ్బు సంపాదించి తర్వాత లగ్జరీ లైఫ్ ని గడపటానికి ప్రాధాన్యతనిస్తారు.

అయితే తాము సంపాదించుకున్న డబ్బును స్వచ్చందంగా సేవ, సహాయక కార్యక్రమాలకు ఖర్చు పెట్టే సెలబ్రిటీలు చాలా తక్కువ మంది ఉన్నారు. చిన్న చితక పాత్రలు చేసి ఇప్పుడు ఓ ఫేమస్ యాక్టర్ గా మారిన సోనుసూద్ తన సొంత డబ్బును చాలా మంది పేదలకు ఖర్చు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఓ గ్రూప్ డ్యాన్సర్ గా ఇండస్ట్రీలోకి అడుపెట్టిన రాఘవ లారెన్స్( Raghava Lawrence) … ఆ తర్వాత హీరోగా..ఇప్పుడు డైరెక్టర్ గా చాలా సక్సెస్ సినిమాలు చేసి స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ హీరో రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకునేలా గతంలో పలు సేవ కార్యక్రమాలు, వృద్దాశ్రమాలు నెలకోల్పాడు. ఇప్పుడు ఏకంగా పేద రైతులకు తన సొంత డబ్బులతో ట్రాక్టర్లు కొనిచ్చి రియల్ స్టార్ అనిపించుకున్నాడు.

Raghava Lawrence
Raghava Lawrence

మనసున్న మారాజు..డబ్బు చాలా మంది సంపాదిస్తారు. కాని పేదలకు పంచి పెట్టడం, అవసరాల్లో ఉన్న వారికి ఆర్ధిక సాయం చేసి ఆదుకోవడం అనేది మాత్రం కొందరు మాత్రమే చేస్తారు. ఈలిస్టులో చేరిన అతి తక్కువ మంది నటుల్లో డైరెక్టర్ కమ్ హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ చేరిపోయాడు. తమిళనాడులోని విలుపురం జిల్లాకు చెందిన ఓపేద రైతు బాధను చూసిన లారెన్స్ తన సొంత డబ్బుతో 10మంది రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు పంపిణి చేస్తానని మాటిచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ముందుగా విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ అనే రైతు కుటుంబానికి తొలి ట్రాక్టర్ ను తానే స్వయంగా ఇంటికి వెళ్లి అందజేశాడు. చెల్లి భర్త చనిపోవడంతో ..ఆమె కుటుంబాన్ని కూడా పోషిస్తున్న రైతు రాజకన్నన్ కళ్లలో సంతోషం చూసేందుకు లారెన్స్ ఈసాయం చేస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోని షేర్ చేశాడు.

Raghava Lawrence
Raghava Lawrence

ఈ సంగతి పక్కన పెడితే లారెన్స్ తన కుమారునికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ బిడ్డలను ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేద్దామా? అని ఆలోచిస్తుంటారు. కానీ లారెన్స్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు.అదేంటంటే.. బిడ్డలకు ఆస్తులను వారసత్వంగా ఇచ్చే ఈ రోజుల్లో తన సేవా గుణాన్నితన కుమారుడు శ్యామ్ కు వారసత్వంగా ఇచ్చాడు రాఘవ లారెన్స్. ఈ సందర్భంగా తన లాగే తన కుమారుడికి కూడా చిన్నప్పటి నుంచే సాయం చేసే అలవాటు ఉందంటూ తన వారసుడిని పరిచయం చేశాడు. ట్విట్టర్ వేదికగ ఒక వీడియోను షేర్ చేసిన లారెన్స్ అందులో తన కుమారుడిని అభిమానులకు, స్నేహితులకు పరిచయం చేశాడు. అలాగే శ్యామ్ గురించి కొన్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. శ్యామ్ ప్రస్తుతం కాలేజీలో చదువుతూనే పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడనన్నాడు లారెన్స్.

Also Read :గ్రేట్.. చిన్నప్పుడే బాల్య వివాహం.. కానీ ఎదిరించి మరి ఇంటర్ లో 978 మార్కులు..

Leave a Comment