Rashmika Mandanna | 2016లో విడుదలైన “కిరిక్ పార్టీ” అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా మారిన రష్మిక “చలో” సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. ‘గీత గోవిందం’, ‘దేవదాస్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పుష్ప’, ‘సీతా రామం’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.మధ్యలో కన్నడలో.. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ‘యజమాన’, యాక్షన్ ప్రిన్స్ ధృవ్ సర్జా ‘పొగరు’ మాత్రమే చేసింది. తర్వాత కార్తి ‘సుల్తాన్’ మూవీతో కోలీవుడ్‌కి వెళ్లింది. రెండో సినిమాకే దళపతి విజయ్ పక్కన ‘వరిసు’ (వారసుడు) యాక్ట్ చేసింది.ఈసారి అమ్మడకి లక్ భలే కలిసొచ్చింది.
ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ‘గుడ్ బై’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అది అంతగా ఆడకపోయినా.. ‘మిషన్ మజ్ను’ చేసింది. రణ్ బీర్ కపూర్‌తో తీస్తున్న ‘యానిమల్’ లో ఛాన్స్ ఇచ్చాడు. ఇక తెలుగులో ఎలాగో ప్రెస్జీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘పుష్ప : ది రూల్’ ఉండనే ఉంది.. ఇంకా రష్మిక మందన్న ప్రేమ పెళ్లి విషయానికి వస్తే “ఛలో” సినిమా కి ముందు రష్మిక మందన్న కన్నడ హీరో రక్షిత్ శెట్టి ను ప్రేమించి అతనితో నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వారిద్దరూ విడిపోయారు.
రష్మిక ఆస్తి పాస్తులు..
ఆ తర్వాత “గీత గోవిందం” సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటి నుంచి రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ఎవరితో అయితే మనం హ్యాపీగా ఉంటామో, వారిని మాత్రమే ప్రేమించాలి. ప్రేమ వర్ణనాతీతం. ప్రేమంటేనే ఫీలింగ్స్. అది ఇద్దరి లో ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది. ఒకరిలో మాత్రమే ఉంటే బాగోదు. ఇక విషయానికి వస్తే నాకు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదు. నాకు ఇంకా పెళ్ళి వయసు రాలేదని నా అభిప్రాయం. నేను ఎవరితో అయితే కంఫర్ట్ గా ఫీల్ అవుతానో వారిని పెళ్లి చేసుకుంటాను,” అని చెప్పుకొచ్చింది రష్మిక.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత కథానాయికల విషయంలో సరిగ్గా సరిపోతుంది.రష్మిక హీరోయిన్ అయిన తర్వాత ఐదు సంవత్సరాలలో ఏకంగా ఐదు ఇళ్లు కొన్నది అనే న్యూస్ వైరల్ అవుతోంది. అది కూడా ఐదు చోట్ల, ఐదు లగ్జీరియస్ అపార్ట్‌మెంట్స్ కావడం విశేషం. హైదరాబాద్, గోవా, ముంబై, కూర్గ్, బెంగుళూరు ప్రాంతాల్లో ఖరీదైన అపార్ట్‌మెంట్స్ సొంతం చేసుకుందట. అలాగే 2021లో ప్రాపర్టీస్‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసిందట ఈ కన్నడ చిన్నది.. ఇక కొన్ని నివేదికల ప్రకారం రష్మిక నికర ఆస్తి విలువ దాదాపు 45 కోట్లు ఉంటుందట.
అలాగే.. నెలకు 60 లక్షల వరకు సంపాదిస్తుందట. ఈ లెక్కన ఆమె పర్ ఇయర్ ఇన్‌కమ్ దాదాపు 8 కోట్లు ఉంటుందని సమాచారం. సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ 10 హీరోయిన్లలో రష్మిక ఒకరు.ఒక్కో సినిమాకు దాదాపు 4 నుంచి 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈమె. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఆమెకు సొంతంగా ప్లాట్స్ ఉన్నాయి. ముంబైలో దాదాపు 8 కోట్ల విలువైన బంగ్లా ఉంది. ఇక రష్మికకు కార్లు అంటే చాలా ఇష్టం.
Also Read : త్వరలో విడాకులు .. కన్నీరు పెట్టుకున్న ప్రియమణి
ఇప్పటివరకు రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి Q3, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి.ఈ విధంగా 27 సంవత్సరాల వయసులోనే రష్మిక (Rashmika) ఇంత మొత్తంలో ఆస్తులు కూడా పెట్టడం అంటే సాధారణమైన విషయం కాదు.ఇలా ఆస్తులు సంపాదించే విషయంలో ఇవి పలువురు స్టార్ కిడ్స్ ని కూడా బీట్ చేస్తోంది.ఇలా రష్మిక ఆస్తులకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో టాప్ హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న ఒకరు. ఇక అల్లు అర్జున్ తో నటించిన పుష్ప సినిమా హిట్ తో తన స్థాయి మరింత పెంచుకుంది. దానితో రష్మిక పారితోషికం బాగా పెంచేసిందని టాక్ వచ్చింది. దానికితోడు యానిమల్ సినిమా మరింత లాభం పొందింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దాని తర్వాత ఫుష్ప 2 సినిమా పారితోషికం పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.దానితో దానితో ఆమె తన పారితోషికంపై సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. తన రెమ్యునరేషన్ ను దాదాపు 4 కోట్ల రూపాయలకి పైగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై హీరోయిన్ మాట్లాడుతూ, రెమ్యునరేషన్ పెంచేసినట్లు ఎవరు చెప్పారు. ఇవి చూసి ఆశ్చర్యపోతున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నేను నిజంగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా నిర్మాతలు మాటలకు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పింది.
రష్మికి యాక్సిడెంట్..
రష్మిక మందనకి చిన్న యాక్సిడెంట్ అయ్యిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పడం జరిగింది. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది రష్మిక. ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. “గత నెల నేను పబ్లిక్ లోకి ఎక్కువగా రాలేకపోయాను. అలాగే సోషల్ మీడియాలో కూడా అభిమానులతో టచ్ లో లేను. నేను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేకపోవడానికి ఓ కారణం ఉంది.అదేంటంటే.. నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. కాబట్టి.. వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నాను. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. నాకు జరిగింది చిన్న యాక్సిడెంట్. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. జీవితం చాలా చిన్నది. ఏ టైంలో ఏమవుతుందో తెలీదు. రేపు అనేది ఉంటుందో లేదో తెలీదు. కాబట్టి.. ప్రజెంట్ ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి” అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

మోసపోయిన హీరోయిన్..
తాజాగా రష్మిక మోసపోయిందనే వార్త సినీ పరిశ్రమలో తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. రష్మిక హీరోయిన్ అయినప్పటినుంచి ఆమెదగ్గర ఒక వ్యక్తి మేనేజర్ గా చేస్తున్నారు. ఆ మేనేజర్ చేతిలో మోసపోయిందనే వార్త గుప్పుమంది.రష్మికకు తెలియకుండా ఆ మేనేజర్ రూ.80 లక్షలను తస్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రష్మిక మేనేజర్ పై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. తనను అడిగితే ఆ డబ్బులు ఇచ్చేదానన్ని, అలా కాకుండా నమ్మక ద్రోహం చేయడం తనకు ఏమాత్రం నచ్చడంలేదని మండిపడింది. క్షణాల వ్యవధిలోనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రపంచంలో అన్నిటికంటే నమ్మక ద్రోహం చేయడమే అత్యంత దారుణమైన విషయమని, తన దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదంటూ పంపేసింది.
ఒకే ఇంట్లో విజయ్ రష్మిక..
దీపావళి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ Happy Diwali అంటూ సోషల్ మీడియా వేదికగా రష్మిక ఓ ఫొటో షేర్ చేసింది. అందులో రష్మిక.. ఇంటి దగ్గర బెంచ్ మీద కూర్చొని ఫొటోకి స్టిల్ ఇచ్చినట్టుగా ఉంది. ఇక రష్మిక పోస్ట్ చేసిన కాసేపటికే.. విజయ్ కూడా Happy Diwali అంటూ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోని షేర్ చేశాడు. తన తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ తో కలిసి ఇంటి వరండాలో మెట్ల మీద కూర్చొని ఫొటోకి ఫోజిచ్చాడు.
అయితే ఈ రెండు ఫొటోలను గమనిస్తే..విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి సెలెబ్రేట్ చేసుకుందని అర్థమైపోతుంది. విజయ్ పక్కనున్న గోడ, రష్మిక ఫొటోలో కూడా ఉంది. అలాగే విజయ్ వెనక ఒక బెంచ్ కొద్దిగా కనిపిస్తుండగా.. రష్మిక ఫొటోలో ఆమె అదే బెంచ్ లో కూర్చున్నట్టు గమనించవచ్చు. మొత్తానికి ఈ ఫొటోల వల్ల విజయ్ ఫ్యామిలీతో కలిసి రష్మిక దీపావళి సెలెబ్రేట్ చేసుకుందని తెలిసిపోయింది. పైగా విజయ్, రష్మిక కూడా Happy Diwali అంటూ ఒకటే టెక్స్ట్ రాసి, హింట్ ఇచ్చినట్టుగా కూడా ఉంది.
Also Read : నిజంగానే ఉదయ్ కిరణ్ ఆప్రేమను కాదని తప్పు చేశారా?
టాలీవుడ్ మీడియాకి దూరం
రష్మిక మాత్రం ఈ మధ్య తెలుగు మీడియా కి చిక్కటం లేదు. మరో వైపు రష్మిక మందన్న విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉందని గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. టాలీవుడ్ ఎక్కడ దీని గురించి ప్రశ్నలు అడుగుతుందో అన్న భయంతోనే రష్మిక కావాలని తెలుగు మీడియాకి దూరంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. తన ప్రేమ విషయమై రష్మిక మందన్న ఎలాంటి పుకార్లకు రియాక్ట్ అవ్వాలని అనుకోవటం లేదని అందుకే కావాలని తెలుగు రాష్ట్రాల మీడియాకి దూరంగా ఉంటుందని ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

అరుదైన గౌరవం
తాజాగా రష్మిక కి ఓ అరుదైన గౌరవం వరించింది. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ వింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మికను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు ఇలాంటి గౌరవం, బాధ్యతను అప్పజెప్పిన కేంద్ర హోంశాఖకు రష్మిక తన ధన్యవాదాలు తెలియజేసింది. ‘ కొన్ని నెలల క్రితం నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యింది.
అదొక సైబర్ క్రైమ్. ఆ ఘటన జరిగినప్పటి నుంచి సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించాలని, ఈ నేరాలపై పోరాడాలని నిర్ణయించుకున్నా. నా ప్రయత్నానికి అండగా కేంద్ర ప్రభుత్వ హోంశాఖ నిలిచింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ అంబాసిడర్ గా నాకు బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నా. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ అంబాసిడర్ గా సైబర్ క్రైమ్స్ పై మీ అందరికీ అవగాహన కల్పిస్తూనే ఉంటా” అని రష్మిక ఆ వీడియోలో తన స్పందనను తెలియజేసింది.
గ్రీన్ సిగ్నల్..
తాజాగా మరో కొత్త హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రష్మిక. కాగా ఆమె నటించిన ‘చావా’ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. శివాజీ కొడుకు కథతో తెరకెక్కిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలోనూ రష్మిక మందన్నానే హీరోయిన్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టైగర్ ష్రాఫ్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా శర వేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న మరో బాలీవుడ్ యంగ్ స్టార్ నటుడి సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపింది.