Akkineni Family | అక్కినేని అఖిల్ కి కట్నం ఎన్ని కొట్లో తెలుసా .

Written by admin

Published on:

Akkineni | నిజానికి ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబం, అక్కినేని కుటుంబం చాలా పెద్దవే అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాలు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక అక్కినేని కుటుంబంలో నాగార్జున ఆయన కుమారులు వారసులుగా కొనసాగుతూ ఉండగా, దగ్గుబాటి కుటుంబంలో సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించగా, వెంకటేష్, రానా హీరోలుగా కొనసాగుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉన్న సంగతి తెలిసిందే.

అక్కినేని కుటుంబం

దగ్గుబాటి వారి కుటుంబం సంగతి కాసేపు పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలోకి అక్కినేని వారసుడిగా అడుగు పెట్టిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు .నాగార్జున విక్రమ్ సినిమాతో తన సినీ జర్నీ ని ప్రారంభించాడు. మొదటి సినిమా అయినా కూడా ఎలాంటి బెరుకు లేకుండా నటించి తండ్రికి తగ్గ వారసుడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున నటించిన చాలా సినిమాలు పెద్దగా ప్రేక్షక ఆదరణకి నోచుకోలేదు.అలాగే దక్షిణ భారతీయ చిత్ర సీమలో ఏ హీరో కూడా చెయ్యని సాహసానికి నాగార్జున పూనుకున్నాడు. ఇండస్ట్రీకి పరిచయమైన నాగార్జున చాలా తక్కువ సమయం లోనే మన్మధుడిగా, హీరోగా, కింగ్ నాగార్జున గా పాపులారిటీని దక్కించుకున్నాడు..ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెర షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు నాగార్జున .

Akkineni Family

ఇక అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటన లలో కూడా నటిస్తూ మంచి లాభాలను పొందుతున్నాడు నాగార్జున.ఇదిలా ఉంటే ప్రస్తుతం.. నాగార్జున భార్య అమల.. నాగార్జున కు రెండవ భార్య అన్న విషయం ఇప్పటికీ కొంతమంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు.అక్కినేని అఖిల్ నాగార్జున అమల దంపతులకు జన్మించాడు. కానీ అక్కినేని నాగచైతన్య మాత్రం నాగార్జున మొదటి భార్యకు జన్మించాడు. అయితే నాగార్జున మొదటి భార్య సీనియర్ హీరో వెంకటేష్ సోదరి లక్ష్మి. మొదట వీరిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ వివిధ కారణాలతో విడాకులు తీసుకుని విడిపోయారు. లక్ష్మి చిన్నప్పటినుండి అమెరికాలో పెరగడంతో పాటు అక్కడే చదువుకుంది.

రామానాయుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అక్కినేని నాగేశ్వరరావు తో మంచి అనుబంధం ఏర్పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ క్రమంలోనే తన కూతురు లక్ష్మిని నాగార్జునకి ఇచ్చి పెళ్లి జరిపించారు.ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న లక్ష్మీని పిలిపించి చెన్నైలో ఇద్దరికి వివాహం జరిపించడం జరిగింది. అలా ఇద్దరికీ వివాహం జరిగిన తర్వాత నాగచైతన్య జన్మించాడు. పెళ్లి తర్వాత లక్ష్మి ఇండియాలో ఉండడానికి ఇబ్బంది పడ్డారట. దాంతో అమెరికాకు వెళ్లిపోయిందని అక్కడే స్థిరపడదామని నాగార్జునతో చెప్పిందట. ఆయన సినిమాలలో బిజీగా ఉండడం వల్ల కుదరలేదని దాంతో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడి విడాకులు తీసుకున్నారని ఇక అదే సమయంలో తనతో నటిస్తున్న అమలతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది .

Also Read : యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉదయ భాను సంపాదన ఎన్ని కొట్లో తెలుసా ..

1989 లో వచ్చిన గీతాంజలి మూవీ ద్వారా మణిరత్నం, ప్రేమయుద్ధం ద్వారా రాజేంద్ర సింగ్ బాబు,నిర్ణయం తో ప్రియ దర్శన్, చైతన్య చిత్రంతో ప్రతాప్ పోతన్, శాంతి క్రాంతి తో రవిచంద్రన్, కిల్లర్ చిత్రంతో ఫాజిల్, క్రిమినల్ సినిమాతో మహేష్ భట్ ఇలా పాతికేళ్ళక్రితమే పలు భాషలకి చెందిన గ్రేటెస్ట్ డైరెకర్స్ ని నాగార్జున తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసాడు.అప్పటివరకు తెలుగు హీరో ఎవరు కూడా ఇతర బాషా దర్శకుల సినిమాల్లో నటించలేదు.కేవలం నాగార్జున ఒక్కడే ఎంతో దైర్యంగా వాళ్ళని తెలుగు చిత్ర పరిశ్రమకి తీసుకొచ్చి సినిమాలు చేసాడు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు నాగార్జున తెలుగు సినిమాని 25 ఏళ్ళ క్రితమే పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లాడని. అలాగే మనీషాకొయిరాలా,జుహీ చావ్లా లాంటి ఇతర భాషలకి చెందిన నటీమణులని కూడా నాగార్జునే తెలుగుతెరకి పరిచయం చేసాడు.Akkineni Family

నాగార్జునతో అమల ప్రేమ..

అక్కినేని నాగార్జున అమల దంపతుల గురించి చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలాగే ఉన్నారు. నాగార్జున – అమల కలిసి ‘ప్రేమ యుద్ధం’, ‘శివ’, ‘కిరాయి దాదా’, ‘నిర్ణయం’, ‘చినబాబు’ సినిమాల్లో నటించారు. 1992 జూన్ 11న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో నాగార్జున అమల ఇద్దరు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో అమల అక్కినేని ఇంటికి తీసుకువచ్చిన కట్న కానుకల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.అక్కినేని ఇంటికి కట్నంగా ఏం తీసుకువచ్చింది అంటూ ప్రశ్న ఎదురవడంతో నాగార్జున సమాధానం చెబుతూ పలు విషయాలు తెలియజేశారు.

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు కట్న కానుకలు అంటే భారీ స్థాయిలోనే ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. కానీ అమల కట్నం గా తన పెళ్లి సమయంలో తన ఇంటికి రెండు కుక్కపిల్లలను తీసుకువచ్చింది అంటూ నాగార్జున తెలిపారు.ఈ విధంగా నాగార్జున (Nagarjuna) తన కట్నం విషయంలో చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి నాగార్జున నిజంగానే అమల కట్నంగా కుక్క పిల్లలను తీసుకువచ్చిందని చెప్పారా లేకపోతే అమలకు జంతువులు అంటే ఇష్టం అని అలా చెప్పారా అనే విషయం తెలియదు కానీ ఈయన చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Akkineni Family

కూతురు పేరు కూడా ఫిక్స్..

నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేనైతే ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నా. అమల డెలివరీకి ఇంకా 6 నెలల సమయం ఉండగా యుఎస్ పంపించేశా. అక్కడ ట్రీట్మెంట్ బావుంటుంది.. వాకింగ్ కూడా ఫ్రీగా చేయొచ్చు అనే ఉద్దేశంతో పంపించినట్లు నాగార్జున తెలిపారు. అఖిల్ జన్మించింది యుఎస్ లోనే. అక్కడ యుఎస్ లో డాక్టర్లు స్కానింగ్ చేసి ఆడపిల్ల అని చెప్పారు. నేనైతే ఎగిరి గంతేశా.. నాకు ఆడపిల్ల పుడుతోందని. అమ్మాయికి నిఖిత అని పేరు కూడా ఫిక్స్ చేశా.

రిటర్న్ టికెట్ నిఖిత పేరు మీద బుక్ చేశా.అమ్మాయిల డ్రెస్సులు కూడా కొన్నా. డెలివరీకి రెండు రోజుల ముందు అమల చెప్పింది. మనకి పుట్టబోయేది అబ్బాయే.. నువ్వు ఫిక్స్ అయిపో అని చెప్పింది. అదేంటి అని అడిగా. నాకు కలలో తెలిసింది అని చెప్పింది. నేను డాక్టర్లు చెప్పారు కదా అమ్మాయి పుడుతుందని.. అమ్మాయే పుడుతుందని నమ్మకంతో ఉన్నా. కానీ డెలివరీ తర్వాత చూస్తే అబ్బాయి. నేను షాక్ అయ్యా. డాక్టర్లు ఎందుకు చీట్ చేశారు.. ఎక్కడ తప్పు జరిగింది అని ఆరా తీస్తే.. స్కానింగ్ రిపోర్ట్ లో కూడా తప్పు రావడానికి 5 శాతం ఛాన్స్ ఉందని చెప్పారు.

నాగ చైతన్య సామ్..

నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య. జోష్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత ఏ మాయ చేసావే సినిమాతో చై.. హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. కొడుకులను హీరోలుగా నిలబెట్టడానికి నాగార్జున పడే కష్టం దేవుడికే తెలియాలి.ఇక చై -సామ్ ల పెళ్లిని నాగార్జున దగ్గరుండి ఎంతో గ్రాండ్ గా జరిపించాడు. రెండు రోజులు.. రెండు విభిన్నమైన సంప్రదాయాల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సమంత వచ్చాక తనకు కూతురు లేని లోటు పోయిందని నాగ్ చెప్పుకొచ్చాడు. కానీ, సమంత- నాగ చైతన్య నాలుగేళ్లు నిండకుండానే విడాకులు తీసుకున్నారు.

శోభిత ధూళిపాళ్లతో ప్రేమ..

ఇకపోతే విడాకుల సమయంలో చాలామంది సమంతను టార్గెట్ చేస్తూ ఎన్నో రకాల విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడ్డారు. అయితే నాగచైతన్య మాత్రం ఆ మరుసటి ఏడాదే ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా లండన్ లో ఒక హోటల్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో అప్పుడే మీడియాలో వార్తలు కోడై కూశాయి. కానీ ఈ విషయంపై వారు స్పందించలేదు. కానీ ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక అక్కినేని నాగార్జున వీరిద్దరి నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.Akkineni Family

Also Read : రోజుకు వేలల్లో ఫోన్ కాల్స్.. కంటతడి పెట్టిన లక్ష్మీపార్వతి,

అఖిల్ సర్ ప్రైజ్..

అయితే నాగ చైతన్య, శోభితల పెళ్లి పనుల్లో ఉండగానే అక్కినేని అఖిల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని హీరో నాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. త్వరలోనే అఖిల్, జైనాబ్ ల వివాహం జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్, జైనాబ్ ల ఎంగేజ్ మెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇదే క్రమంలో జైనాబ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. జైనాబ్ హైదరాబాద్ లో పుట్టినా ఎక్కువగా ఢిల్లీ, దుబాయ్, ముంబైలోనే పెరిగిందట. ప్రస్తుతం ముంబైలోనే నివాసముంటున్నట్లు సమాచారం. కాగా అఖిల్ తో ఎంగేజ్ మెంట్ అయిన వెంటనే జైనాబ్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను ప్రైవేట్ గా మార్చేసిందట.

Akkineni Family

దీంతో ఆమె ఫొటోలు ఎక్కువగా బయటకు రావడం లేదు. అయితే జైనాబ్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ని రానా, మిహీక, ఉపాసన, మెహ్రీన్ తదితర సినిమా తారలు ఫాలో అవుతున్నారు.నిన్న మొన్నటి వరకు అక్కినేని ఇంటికి కోడలు అంటే నాగచైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల అంటూ ఓ రేంజ్ లో ప్రశంసించారు . అసలు నాగచైతన్య ఆమెని పెళ్లి చేసుకోవడం చాలా చాలా లక్కీ అంటూ కూడా చెప్పుకొచ్చారు . శోభిత ధూళిపాళ్లకు స్పెషల్ క్రేజ్ కూడా దక్కేలా చేశారు . సీన్ కట్ చేస్తే ఒకే ఒక్క దెబ్బతో శోభిత ధూళిపాళ్ళ క్రేజ్ మొత్తం ఢమాల్ పడిపోయింది . అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న జైనబ్ గురించే ఎక్కడ చూసినా వార్తలు వినిపిస్తున్నాయి .ఆమె రిచ్ సెలబ్రిటీ . బడా వ్యాపారవేత్త కూతురు . అంతేకాదు బాగా సంపాదిస్తుంది .Akkineni Family

అంతేకాదు అక్కినేని ఫ్యామిలీకి దాదాపు 2000 కోట్లకు పైగా కట్నాలు తీసుకొని వస్తుంది అన్న ప్రచారం ఊపొందుకుంది. ఈ క్రమంలోనే నాగ చైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ వస్తుంది అఖిల్ కి కాబోయే భార్య జైనబ్ . తాజాగా అమల పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. శోభిత ధూళిపాళ్ళ నిశ్చితార్ధం చేసుకున్నాక ఒక విష్ కూడా చేయలేదు . కానీ అఖిల్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నాక అమల పోస్ట్ పెట్టింది . దీనికి సంబంధించి అమలా ట్రోలింగ్ కూడా ఫేస్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంటి బాధ్యతలు మొత్తం చిన్న కోడలికి అప్పగిస్తూ అమల సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి .

🔴Related Post

Leave a Comment