రాజేంద్ర ప్రసాద్.. తొలి సినిమా ..
Rajendra Prasad | సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్.. ప్రతి తెలుగు ప్రేక్షకుడికి తెలిసిన పేరే. ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై తన నటనతో అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్‌తో పాటు అప్పుడప్పుడు ప్రధాన పాత్రల్లో పలు సినిమాలను చేస్తున్నారు. ఆ మధ్య ఓటీటీలోకి కూడా అడుగుపెట్టేశారు. సేనాపతి, కృష్ణరామ సహా పలు ఓటీటీ కంటెంట్‌తోనూ ఆడియెన్స్‌ను మెప్పించారు.నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన విషయం మనకు తెలిసిందే. తన సినిమా ఇప్పటికి కూడా బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే నవ్వకుండా ఎవరు ఉండలేరు. అంతలా ఆయన తన నటనతో బాగా అందరినీ ఆకర్షించాడు.
ఇక ఈయన భార్య ఎవరు..?? పిల్లలు ఎంత మంది అని చాలా మందికి తెలియకపోవచ్చు.ఎందుకంటే వీళ్లు ఎక్కువ మీడియా ముందుకు రారు కాబ్బటి. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి భార్య పేరు విజయ చాముండేశ్వరి. విజయ చాముండేశ్వరి ఎవరో కాదు రమప్రభా గారి అక్క కూతూరు. రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి పేరు బాలాజీ.. కూతురు పేరు గాయత్రి. రాజేంద్ర ప్రసాద్ సినిమా షూటింగ్స్ సమయంలో రమాప్రభగారి ఇంటికి తరచూ వెళ్తూ.. అక్కడే ఉన్న వాళ్ల అక్క కూతురిని చూసి పెళ్లి అంటు చేసుకుంటే ఈవిడనే చేసుకోవాలని డిసైడ్ అయాడట. ఇక అలా అల్ల సీన్ కట్ చేస్తే వీళ్ల పెళ్లి చెన్నైలోని కపాలేశ్వర స్వామి గుళ్లో జరిగింది.ఆ తర్వాత వాణీ మహల్‌లో రిసెప్షన్ జరిగింది.

టాలీవుడ్ లో అగ్ర హాస్య నటీమణుల్లో రమాప్రభ ఒకరు. మహామహుల సరసన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యనటిగా నటించారు. ఆమె తమ్ముడిగా భావించే దివంగత నటుడు రాజబాబు తోనే దాదాపు 300 చిత్రాల్లో నటించారు. అలాగే అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, రేలంగి తదితరుల పక్కన ప్రాముఖ్యత కలిగిన క్యారెక్టర్ లలో మెప్పించారు. సినిమాల్లో నటిస్తూనే ప్రముఖ నటుడు శరత్ బాబును ప్రేమ వివాహం చేసుకున్న రమాప్రభ 13 ఏళ్ల కాపురం తరువాత విడిపోయారు. రాజేంద్ర ప్రసాద్ కెరియర్ లో చేసిన మంచి సినిమాల్లో ఆ నలుగురు సినిమా( Aa Naluguru ) ఒకటి స్పెషల్ గా చెప్పుకోవచ్చు.
కొడుకు గురించి..
ఇండస్ట్రీలో 40 ఏళ్ల ప్రస్థానం ఉండి.. స్టార్ హీరోగా చక్రం తిప్పిన రాజేంద్ర ప్రసాద్ తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయాడు. కొండంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా ఎందుకు తన వారసుడిని హీరో చేయలేకపోయాడు అని ఆయన అభిమానుల్లో ఎప్పటి నుంచో ఒక అనుమానం ఉంది. దాని వెనుక ఒక పెద్ద కథ కూడా ఉంది. అందరి హీరోల మాదిరే తన వారసుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని రాజేంద్రప్రసాద్ చాలా ఆశ పడ్డాడు.దాని కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు.అంతేకాదు బాలాజీ ప్రసాద్ చూడటానికి ఆయన తండ్రి రాజేంద్రప్రసాద్ లాగే ఉంటాడు.
దాంతో కొడుకును హీరోగా పరిచయం చేయాలంటూ రాజేంద్రుడిని చాలామంది అడిగారు కూడా. ఈ క్రమంలోనే తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత రాఘవేంద్రరావు చేతిలో పెట్టాడు రాజేంద్ర ప్రసాద్.భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, అందరూ దొంగలే ఇలాంటి కామెడీ సినిమాలు తీసిన నిధి ప్రసాద్ దర్శకత్వంలో తన కొడుకును పరిచయం చేయాలనుకున్నాడు. సినిమాకి ముహూర్తం కూడా పెట్టారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేకపోయింది. చాలా రోజుల పాటు ఆగిపోవడంతో బాలాజీ ప్రసాద్ కు సినిమాలపై విరక్తి వచ్చిందని ఇండస్ట్రీలో వార్తలున్నాయి.
Also Read : హీరో సూర్య ఆస్తుల విలువ ఎన్ని కొట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

జీవితంలో విషయం ..
రాజేంద్రప్రసాద్‌కు ఓ కొడుకు బాలాజీ ప్రసాద్‌తో పాటు కూతురు గాయత్రి ఉన్నారు. గాయత్రి ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూతురితో తనకు చాలా రోజుల పాటు మాటలు లేవని ఓ సినిమా వేడుకలో రాజేంద్రప్రసాద్ అన్నాడు. సినిమాల్లో లాగే.. రాజేంద్ర ప్రసాద్, గాయత్రిల బంధం ఎన్నో బరువెక్కిన బాధలతో నిండి ఉంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రిది ప్రేమ వివాహం. ఈ పెళ్లి రాజేంద్ర ప్రసాద్‌కు ఇష్టం లేదు.కానీ.. గాయత్రి, ప్రేమించిన వారిని వదలిపెట్టలేక పెళ్లి చేసుకుని తండ్రికి దూరమైంది. కొన్నాళ్ల పాటు వీళ్లిద్దరి మధ్య అసలు మాటలు లేవు. కాగా రాజేంద్రప్రసాద్ 2018లో బేవర్స్ అనే సినిమాలో నటించాడు.ఈ సినిమాలో తల్లి.. తల్లి నా చిట్టి తల్లి అంటూ సునీల్ కశ్యప్ కంపోజ్ చేసి..
ఆలపించిన గీతం వింటుంటే.. గొంతు ఆరిపోతుంది. అంత గొప్పగా ఈ పాటను కంపోజ్ చేశాడు. అంతే గొప్పగా సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాశాడు.ఈ పాట గురించి చెప్తూ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. ఈ పాటను.. తన కూతురు గాయత్రిని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాడట.ఈ పాట విని ఇద్దరు కంటతడి పెట్టారట. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు స్టార్ట్ అయ్యాయని… అలా ఆ పాట తనను మార్చిందని పాట గొప్పతనాన్ని తెలిపాడు. అలా తన కూతురిపై బంధాన్ని వెల్లడించాడు. . ఏ అమ్మవారిని అయితే అమ్మగా రాజేంద్రప్రసాద్ భావించారో.. ఆ అమ్మవారికి ఇష్టమైన దసరా రోజులలోనే తన కుమార్తెను కోల్పోవడం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది.
అయిన వాళ్ళే మోసం ..
ఎన్టీఆర్ స్పూర్తితో సినిమాల్లోకి వచ్చాడు. అది కూడా అనుకోకుండానే ఆయనకు అవకాశాలు వచ్చాయి. పెద్దగా కష్టపడకుండానే ముందుగా సినిమాల్లోకి వచ్చేసాడు రాజేంద్రప్రసాద్. వచ్చిన తర్వాత నిలబడటానికి మాత్రం చాలా కష్టపడ్డాడు. ఆయన వచ్చే సమయానికి ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్‌బాబు, కృష్ణ తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అప్పట్లో ప్రేక్షకులు కొత్త హీరోను ఆదరించాలంటే ఆయనలో ఆకర్షించే గుణం ఏదో ఒకటి ఉండాలి.
అందుకే తను చార్లీ చాప్లిన్ రూట్ ఎంచుకున్నానని చెప్పాడు రాజేంద్ర ప్రసాద్. అలా కామెడీ సినిమాలు చేసుకుంటూపోయానని.. కానీ ఒకానొక సమయంలో తనను సొంత వాళ్లే ఆర్థికంగా మోసం చేసారని చెప్పాడు. అప్పటి వరకు సంపాదించిందంతా ఊడ్చుకుపోయారని.. నమ్మిన వాళ్లే ఇంత దారుణంగా మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదని చెప్పాడు రాజేంద్ర ప్రసాద్. ఏదేమైనా కూడా ఆ జ్ఞాపకాలు మాత్రం మరిచిపోలేనివి అంటున్నాడు నట కిరీటి.
Also Read : శోభన్‌బాబు, జయలలిత పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే ?
కొన్నాళ్లుగా తన కామెడీతో అలరిస్తూ వస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికీ వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నాడు. అయితే ఆయన కూతురు గాయత్రి (38) గుండెపోటుతో శుక్రవారం రాత్రి కన్నుమూసింది. గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గాయత్రిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి తుదిశ్వాస విడిచింది. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. గాయత్రి కూతురు సాయితేజస్విని మహానటి సినిమాలో చిన్ననాటి కీర్తిసురేష్ పాత్రలో కనిపించింది.

సినిమాల్లో లాగే.. రాజేంద్ర ప్రసాద్, గాయత్రిల బంధం ఎన్నో బరువెక్కిన బాధలతో నిండి ఉంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రిది ప్రేమ వివాహం. ఈ పెళ్లి రాజేంద్ర ప్రసాద్‌కు ఇష్టం లేదు.కానీ.. గాయత్రి, ప్రేమించిన వారిని వదలిపెట్టలేక పెళ్లి చేసుకుని తండ్రికి దూరమైంది. కొన్నాళ్ల పాటు వీళ్లిద్దరి మధ్య అసలు మాటలు లేవు. కాగా రాజేంద్రప్రసాద్ 2018లో బేవర్స్ అనే సినిమాలో నటించాడు.తన కూతురు గాయత్రిని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాడట.ఈ పాట విని ఇద్దరు కంటతడి పెట్టారట. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు స్టార్ట్ అయ్యాయని… అలా ఆ పాట తనను మార్చిందని పాట గొప్పతనాన్ని తెలిపాడు. అలా తన కూతురిపై బంధాన్ని వెల్లడించాడు. .
అంతేకాదు బాలాజీ ప్రసాద్ చూడటానికి ఆయన తండ్రి రాజేంద్రప్రసాద్ లాగే ఉంటాడు. దాంతో కొడుకును హీరోగా పరిచయం చేయాలంటూ రాజేంద్రుడిని చాలామంది అడిగారు కూడా. ఈ క్రమంలోనే తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత రాఘవేంద్రరావు చేతిలో పెట్టాడు రాజేంద్ర ప్రసాద్.భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, అందరూ దొంగలే ఇలాంటి కామెడీ సినిమాలు తీసిన నిధి ప్రసాద్ దర్శకత్వంలో తన కొడుకును పరిచయం చేయాలనుకున్నాడు. సినిమాకి ముహూర్తం కూడా పెట్టారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేకపోయింది.