Monalisa | మొన్న పూసలమ్మే మోనాలిసా.. నేడు స్పెషల్ ఫ్లైట్?

Written by admin

Published on:

మహా కుంభమేళా

Monalisa | 144 ఏళ్లకు ఓసారి వచ్చే మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభమేళాకు 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అధికారుల అంచనాలకు మించి.. మహా కుంభమేళా ప్రారంభం అయిన 26 రోజుల్లోనే ఈ సంఖ్య 40 కోట్లు దాటింది.జనవరి 13వ తేదీన మహా కుంభమేళా ప్రారంభం అయింది. ఈనెల 26వ తేదీన మహా శివరాత్రి నాడు మహా కుంభమేళా ముగియనుంది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు కోట్లాది మంది భక్తులు పోటెత్తారు.

ఈ నేపథ్యంలోనే జనవరి 13 వ తేదీ నుంచి 26 రోజుల వరకు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో స్నానాలు ఆచరించారు.మకర సంక్రాంతి సందర్భంగా ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. పుష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానం చేశారు. మరోవైపు.. జనవరి 30, ఫిబ్రవరి 1వ తేదీల్లో 2 కోట్ల మంది మహా కుంభమేళాకు చేరుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 5వ తేదీన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. అంతకుముందు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా మహా కుంభమేళాలో స్నానం ఆచరించారు.

Monalisa
Monalisa

ఈ మహా కుంభమేళాకు మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు.నిత్యం సరాసరి 40 లక్షల మంది త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు.ఇంకా మహా కుంభమేళా ముగిసేందుకు 18 రోజుల సమయం ఉండగా.. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. భక్తుల రద్దీ చూస్తుంటే ఈసారి మహా కుంభమేళాలో 50 కోట్ల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి రికార్డు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్కూల్ స్టూడెంట్స్‌కు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని యూపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

Also Read : మీకు తెలుసా .. ఒక్క షో కోసమే 5000 చీరలు కట్టిన యాంకర్ సుమ ..

విపరీతమైన రద్దీ..

ప్రయాగ్‌రాజ్‌ వైపు వెళ్లే దారులన్నీ వాహనాలతో కిక్కిరిపోతున్నాయి. దీంతో 200-300 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌‌లే దర్శనమిస్తున్నాయి. యాత్రికుల వాహనాలు గంటలపాటు రోడ్లపైనే నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోనే వేలాది వాహనాలను నిలిపివేస్తుండగా.. యూపీ అధికారుల నుంచి అనుమతి వస్తేనే వాటిని అనుమతిస్తున్నట్లు సమాచారం.ప్రయాగ్‌రాజ్‌‌కు వెళ్లే మార్గాల్లో గత మూడు రోజుల నుంచి విపరీతమైన రద్దీ నెలకుంది. ప్రయాగ్‌రాజ్‌-కాన్పుర్‌, ప్రయాగ్‌రాజ్‌-లక్నో-ప్రతాప్‌గఢ్‌, ప్రయాగ్‌రాజ్‌-వారణాసి-మీర్జాపుర్‌, ప్రయాగ్‌రాజ్‌-రేవా జాతీయ రహదారులపై వాహనాలు బారులు తీరాయి.

తాము 48 గంటలుగా ట్రాఫిక్‌లోనే చిక్కుకున్నట్టు చాలా మంది చెబుతున్నారు. 50 కి.మీ దూరానికే 10-12 గంటల పట్టిందని వాపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. సంగమ స్థలానికి చేరుకోడానికి కనీసం 20 కి.మీ. మేర కాలినడకన వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు.గతంలో మహా కుంభ్, కుంభమేళా 75 రోజులు కొనసాగినట్లు అఖిలేష్‌ యాదవ్‌ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళా గడువు తక్కువగా ఉందని చెప్పారు. మహా కుంభమేళకు వెళ్లలేని భక్తుల కోసం గడువును ప్రభుత్వం పొడిగించాలని కోరారు.

అయితే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగున్న మహా కుంభమేళాకు (Maha Kumbh) కోట్లాది భక్తులు పోటేత్తుతున్నారు. అక్కడికి వెళ్లే రైళ్లతోపాటు రహదారులు కిక్కిరిసిపోయాయి. దీంతో కొందరు భక్తులు కుంభమేళాకు వెళ్లలేకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ నేపథ్యంలో మహా కుంభమేళా గడువును పొడిగించాలని యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ‘ఇప్పుడు చాలా మంది మహా కుంభ్‌కు వెళ్లాలని కోరుకుంటున్నారు. కానీ వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మహా కుంభ్ సమయ పరిమితిని ప్రభుత్వం పొడిగించాలి’ అని అన్నారు.

Monalisa
Monalisa

సినిమాల్లో ఆఫర్

దరిద్రం ప్రతిసారీ తలుపు తడుతుంది. కానీ అదృష్టం మాత్రం లైఫ్ లో ఒక్కసారే తలుపు తడుతుంది అన్న త్రివిక్రమ్ సినిమాలోని డైలాగ్ కు మహా కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా స్టోరీ సరిగ్గా సరిపోతుంది.మొన్నటివరకు ఇళ్లిళ్లూ తిరుగుతూ పూసలు అమ్ముకున్న ఈ ముద్దుగుమ్మ.. మహాకుంభమేళా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళా (Maha Kumbhmela)లో తన అందమైన కళ్లు, చక్కని చిరునవ్వు అట్రాక్ట్ చేసింది. ఒకే ఒక్క వీడియోతో దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసింది.

ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే ఒక్క లుక్ తో బాలీవుడ్ లోనే మూవీ ఆఫర్ వచ్చింది.ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా (Sanoj Mishra)కు మోనాలిసా బాగా నచ్చేసింది. దీంతో ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. తాజాగా తన మాట నిలబొట్టుకున్నారు.తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తోన్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’లో (The Diary Of Manipur) హీరోయిన్‌గా మోనాలిసాను ఎంపిక చేశారు.

ఈ మేరకు సనోజ్ మిశ్రా.. ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌లోని మోనాలిసా ఇంటికి వెళ్లి ఆమె కుటుంబాన్ని కలిశారు. ఆమె తండ్రికి చిత్ర పరిశ్రమపై ఉన్న సందేహాలను క్లియర్ చేశారు. ఈ క్రమంలో వీరి మధ్య అగ్రిమెంట్ జరిగిందట. పలు మీడియా కథనాల ప్రకారం.. ది డైరీ ఆఫ్ మణిపూర్ లో మోనాలిసా నటించడానికి రూ.21 లక్షల రెమ్యునరేషన్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా లోకల్ బ్రాండింగ్ కోసం మరో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అప్పుడే స్పెషల్ ఫ్లైట్..

తాజాగా ఆమె ఓ బ్రాండ్ ఈవెంట్ కోసం కేరళ వెళ్లింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో కలిసి ఓ స్పెషల్ ఫ్లైట్ లో కేరళకు ప్రయాణించింది. ఈ సందర్భంగా సనోజ్ మిశ్రా స్వయంగా ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లగా ఎస్కలేటర్‌పై వెళ్లడంలో మోనాలిసా కాస్త ఇబ్బంది పడిగా డైరెక్టర్ సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.కాగా ఇటీవల నటి హనీరోజ్ ను వేధించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అతను బెయిల్ పై బయట ఉన్నాడు. ఇప్పుడు అతను కేరళలో మరో బంగారు ఆభరణాల దుకాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడిదే ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైంది మోనాలిసా.అంతే కాదు తాజాగా కేరళలోని ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో మోనాలిసా సందడి చేసింది. అక్కడ స్టేజ్ పై డాన్స్ పై యాంకర్ తో కలిసి డాన్స్ వేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : ‘దేవర’లో తారక్ భార్యగా కనిపించిన ఈమె వయస్సు ఎంతో తెలుసా..?

Monalisa
Monalisa

తొక్కిస‌లాట

కుంభ‌మేళాకు దేశం న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు పోటెత్తుతున్నారు. ప్ర‌యాగ్‌రాజ్ వెళ్లేందుకు శ‌నివారం రాత్రి ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌కు భారీగా భ‌క్తులు చేరుకున్నారు. ఈ క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగింది. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృల్లో 11 మంది మ‌హిళ‌లు, న‌లుగురు చిన్నారులు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ దుగట‌న 14, 15 ప్లాట్‌ఫాంల‌పై జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృ ల కుటుంబాల‌కు సంతాపం ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అయితే ఈ ప్ర‌మాదంపై రైల్వే అధికారులు అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.14వ నంబ‌ర్ ప్లాట్‌ఫాంపై ప్ర‌యాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచారు. కుంభ‌మేళాకు వెళ్లే భ‌క్తులు భారీగా చేరుకున్నారు. స్వ‌తంత్ర సేనాని ఎక్స్ ప్రెస్, భువ‌నేశ్వ‌ర్ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆల‌స్యం కావ‌డంతో వాటి కోసం వ‌చ్చిన ప్ర‌యాణికులు కూడా అదే స‌మ‌యంలో 12, 13, 14 నంబ‌ర్ ప్లాట్‌ఫాంల‌పై ఉన్నారు. దీంతో ఒక్క‌సారిగా అక్క‌డ ర‌ద్దీ పెరిగిపోయి తొక్కిస‌లాట‌ జరిగినది .

మహాకుంభ మేళా అంటే..?

మహాకుంభ మేళా కార్యక్రమం పురాణాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోందని చాలా మంది చెబుతారు. ఈ మహా కుంభమేళా ముఖ్య ఉద్దేశం పూర్వం అమృత కలశం కోసం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో, అందులోని అమృతపు చుక్కలు భూమి మీద పడ్డాయని, అందుకే నాలుగు ప్రదేశాలలో మహా కుంభమేళా జరుగుతుందని భక్తుల విశ్వాసం.ఈ మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించడం హిందూ సంప్రదాయం ప్రకారం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.

Also Read : వడ్డే నవీన్ భార్య కి నందమూరి కుటుంబానికి ఉన్న బంధం ఇదే .

కానీ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసుల గారి మధ్య జరిగిన యుద్ధం 12 సంవత్సరాలు జరిగిందని. దేవతలు రాక్షసుల మధ్య జరిగిన 12 సంవత్సరాలు మనకు 144 సంవత్సరాలతో సమానమని చెబుతారు. ఇందులో భాగంగానే దాదాపు 144 సంవత్సరాల తర్వాత మళ్లీ మహా కుంభమేళా నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి కోట్ల సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి తరలి వెళ్తున్నారు.కుంభమేళాకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కాజీపేట మీదుగా ఈనెల 17న ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న చర్లపల్లి నుంచి కాజీపేట మీదుగా దానాపూర్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వెల్లడించారు.

7121 నెంబర్ గల రైలు 17న మధ్యాహ్నం 3.10 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి కాజీపేట మీదుగా 18న రాత్రి 11.55 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుంది. అలాగే 07122 నెంబర్ గల రైలు దానాపూర్‌లో 19న సాయంత్రం 3.15 గంటలకు బయలుదేరి 20న 11.45 చర్లపల్లికి చేరుకుంటుంది.ఈ రైలు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, చంద్రపూర్ స్టేషన్లో ఆగుతుంది. రైలుకు 1ఏ, 2ఏ, 3ఏ, స్లీపర్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. irctc.gov.in వెబ్ సైట్‌కు వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు. కుంభమేళాకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

🔴Related Post

Leave a Comment