తెరకు పరిచయం
Actress Ileana | ఓ పదేళ్లు సౌత్ సినిమాలకు ఈ ముద్దుగుమ్మ దూరమైన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ ఆఫర్లు అందుకోలేకపోయింది. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలోనే సినిమాలు చేస్తూ కెరీర్ ను అలా సాఫీగా సాగిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా కనిపిస్తూ తన ఫ్యాన్స్ కోసం ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతోంది ఆమె గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. పలు యాడ్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది.మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకుంది.
ఇక ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి సినిమాలో కనిపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ మూవీతో ఇలియానా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది.అయితే ఇలియానా కథానాయికగా నటించాల్సిన సినిమా దేవదాసు కాదట. అంతకు ముందే ఆమె ఓ ప్రాజెక్ట్ ఛాన్స్ మిస్సయ్యిందట. అప్పట్లో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ధైర్యం సినిమాతో ఇలియానా సినీ పరిశ్రమకు పరిచయం కావాల్సింది.ఆ మూవీ కోసం అడిషన్ ఇచ్చి దాదాపు 3 నెలలు డేట్స్ కూడా ఇచ్చిందట. కానీ పలు కారణాల చేత ఇలియానా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.నితిన్ నటించిన ధైర్యం సినిమా 2005లో రిలీజ్ అయ్యింది.
ఆ తర్వాత ఏడాది 2006లో దేవదాసు మూవీ రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఆ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.ఆ తరువాత మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజా రవితేజ సరసన నటించి మెప్పించింది. ఇలియానా కెరీర్ లో ‘దేవదాస్’, ‘పోకిరి’తో పాటు ‘మున్నా’, ‘జల్సా’, ‘కిక్క్’, ‘జులాయి’ వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించి పెట్టాయి. మిగితా చిత్రాల్లోనూ ఆమె పెర్ఫామెన్స్ ఇరగదీసింది.అయితే తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ వైపు తొంగి చూసింది. కానీ అక్కడ ఆమెకు అసలు లక్ కలిసి రాలేదు. రణ్ బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసినా సక్సెస్ రాలేదు. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది. కానీ అప్పటికే ఆమె క్రేజ్ బాగా తగ్గిపోయింది. 2018లో రవితేజతో కలిసి నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ భారీ డిజాస్టర్ అయ్యింది.

Also Read : దేవిశ్రీ లో ఉన్న మంచితనం ఏంటో తెలుసా ..
ఆమె కూడా నటే ..
ఇలియానా తల్లి కూడా ఒక నటీ అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.. ఇలియానా తల్లి పేరు సమీరా డిక్రూజ్.. ఈమె ఒక చిత్రంలో గెస్ట్ పాత్రలో కనిపించిందట.గతంలో సురేందర్ రెడ్డి, రవితేజ కాంబినేషన్లో వచ్చిన కిక్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే.. అయితే ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ లో ఒక కామెడీ సన్నివేశంలో హీరోయిన్ ఇలియానా తల్లి సమీరా డీక్రుజ్ కనిపించిందట.జిగురు జింగానీయా అంటూ బ్రహ్మానందాన్ని కలుస్తుందో ఆమె ఇలియానా అమ్మ గారే నట.. అయితే ఈ విషయం విన్న ఇలియానా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఇది ఆయన ఎక్కడికి వెళ్లినా సరే కచ్చితంగా ఆమె వెంట తన తల్లిని కూడా తీసుకొని వెళ్తూ ఉండేది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇలియానా ప్రస్తుతం అవకాశాలు కనుమరుగయ్యాయి.
నటి ఇలియానా తాను అమెరికాకు చెందిన మైఖేల్ డోలన్ ను వివాహమాడినట్లు తెలిపింది. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చివరికి తన పెళ్లి విషయం చెప్పేసింది. దీనికి ముందు ఆమె 2023 ఏప్రిల్ లో గర్భవతినంటూ ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. తర్వాత 2024 ఆగస్టులో కోవా ఫీనిక్స్ డోలన్ అనే పిల్లాడికి జన్మనిచ్చింది.ఇంటర్వ్యూలో మైఖేల్ డోలన్ గురించి అడిగినప్పుడు ఆమె పెద్దగా నోరు మెదపలేదు. తన వైవాహిక జీవితం సంతోషంగానే ఉన్నట్లు తెలిపింది. తన భర్త గురించి చెబుతూ ‘‘ అతడు నా కష్ట కాలంలో తోడున్నాడు.
Also Read : దేవిశ్రీ లో ఉన్న మంచితనం ఏంటో తెలుసా ..
నా ఆనందకర సమయాల్లోనూ అతడు నాకు చేదోడువాదోడుగా ఉన్నాడు. పరిచయం అయిన నాటి నుంచే నాతో ఒకేలా ఉన్నాడు. అతడి ప్రేమ, మద్దతు ఏదీ చెక్కుచెదరలేదు’’ అంది.నేను బిడ్డ పుట్టాక చాలా డిప్రెషన్ కి గురయ్యాను. చాలా ఏడ్చాను. నా బాబు వేరే గదిలో పడుకుంటే డాక్టర్లు బాగా చూసుకున్నారు. నేను ఇంకో గదిలో ఉండి ఏడ్చాను. ఆ సమయంలో నాకు మైఖేల్ డోలన్(ఇలియానా భర్త) తోడుగా నిలబడ్డాడు. నన్ను రెస్ట్ తీసుకొమ్మని చెప్పి బాబుని తనే చూసుకున్నాడు. ఇంత మంచివాడు నాకు తోడుగా రావడం నా అదృష్టం. నేను ఏమి చెప్పకుండానే నాకు కావాల్సినవి అన్ని చేస్తాడు అని చెప్పుకొచ్చింది.
టార్చర్ పెట్టాడని
2012లో తాను అనురాగ్ బసు దర్శకత్వంలో బాలీవుడ్ లో ‘బర్ఫీ’ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించానని ఇలియానా తెలిపింది. ఆ టైమ్ లో తాను సౌత్ లో చాలా బిజీగా ఉన్నానని… అయితే, ‘బర్ఫీ’ వంటి చిత్రాల్లో అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని తాను భావించాని… అందుకే తాను ఆ సినిమాకి ఓకే చెప్పానని వెల్లడించింది.కానీ, దక్షిణాది వాళ్లంతా తాను సౌత్ ను వదిలేసి బాలీవుడ్ కి మకాం మార్చానని భావించారని అనుకున్నారని… ఆ ఆలోచనతోనే దక్షిణాది దర్శకనిర్మాతలు తనకు అవకాశాలు ఇచ్చేందుకు వెనుకాడారని తెలిపింది.బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తాను సినిమాలను ఎంచుకునే విధానంలో కూడా మార్పు వచ్చిందని ఇలియానా తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని తనకు అనిపిస్తుంటుందని చెప్పింది.
ఇలియానాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను వివరించింది. మొదట మోడలింగ్, మ్యూజిక్ వీడియోలు చేసిన తను సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. ఆ సమయంలో తనను లైం కం గా చాలా మంది వేధించారనే విషయాన్ని బయటపెట్టింది. అందులో టాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఉన్నారట. అందులో ఓ డైరెక్టర్ తన కోరిక తీర్చాలంటూ టార్చర్ పెట్టాడని చెప్పింది. అతను చెప్పినట్టు చెయ్యడం ఇష్టం లేక ఆహ* చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఆ సమయంలో తన ఫ్యామిలీ గుర్తు రావడం వల్లే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని తెలిపింది.
అయితే ఆ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం చెప్పలేదు.ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగువెలిగింది ఇలియాన. బడా హీరోలతో సమానంగా స్టార్ స్టేటస్ అనుభవించింది. ఆమె కాల్షీట్ల కోసం హీరోలు క్యూ కట్టేవాళ్లు. అలా ఒక దశలో భలే దొంగలు అనే సినిమాకు ఏకంగా కోటిన్నర వరకు పారితోషికం తీసుకుంది ఇలియాన. కాకపోతే బాలీవుడ్ మెరుపుకలలు ఆమెను తెలుగులో ఉండనివ్వలేదు. హిందీ సినిమాల వెంట పడేలా చేశాయి. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయిన ఈ గోవా బ్యూటీ… అక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

మరీ ముఖ్యంగా ఇటీవల ఆమె చేసిన సినిమా డిజాస్టర్ అవ్వడంతో బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు ఇచ్చేవాళ్లు కరువయ్యారు.అయితే మొన్నటి వరకు ఆమె వస్తుందని కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసిన హీరోలు ఇప్పుడు మాత్రం ఆమెను పట్టించుకోవడం లేదు. దీంతో ఇలియానా తన పారితోషికాన్ని సగానికి సగం తగ్గించేసుకుందట. ఎవరైనా అవకాశం ఇస్తే…. దాదాపు 50లక్షలకు అటుఇటుగానే సినిమా చేసే ఆలోచలో ఉందట. కనీసం ఈ ఆఫర్ అయినా మన తెలుగు మేకర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుందేమో చూడాలి.ఆస్తులు విషయానికి వస్తే అమెరికాలో కోటి రూపాయల విలువ గల విల్లా ఒకటి ఉంది. అలాగే ముంబాయ్‌లోని బాంద్రా ఏరియాలో 4.7 కోట్ల రూపాయల విలువచేసే విల్లా ఉంది.
Also Read : సూర్య తో ప్రేమలో పడటానికి కారణం అదే .. జ్యోతిక
ఇదిలా ఉంటే టాలీవుడ్‌కు దూరమైన ఇలియాన, హైదరాబాద్‌లో సంపాదించుకున్న ఆస్తులను అమ్ముకోవాలని చూస్తుంది. దాదాపు కోటి ఇరవై అయిదు లక్షల రూపాయల ఆస్తులను అమ్మకానికి పెట్టింది. ఇలియానకు హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతం, ల్యాంకో హిల్స్‌లో కోటి ఇరవై అయిదు లక్షల విలువ గల ప్లాట్‌ను కొన్నది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ను అమ్మకానికి పెట్టింది. ఎవరైన కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకు అమ్మేయండి అంటూ టాలీవుడ్ సన్నిహితులకు చెప్పింది.
Also Read : మంచు మనోజ్, విష్ణు సొంత అన్నదమ్ములు కాదని మీకు తెలుసా ..
బ్యాన్ చేశారు
ప్రస్తుతం ఇలియానా మంజిత్ సింగ్, సుఖ్ జీత్ సింగ్ సింగర్లు రూపొందిస్తున్న మ్యుజిక్ వీడియోలలో తన అందాలను ప్రదర్శిస్తూ వార్తల్లో నిలిచారు.మ్యూజిక్ వీడియోలు అయినా ఇలియానాకు మళ్లీ ఆఫర్లను తెచ్చిపెడతాయేమో చూడాల్సి ఉంది.ఇలియానా అందాల ప్రదర్శనతో అవకాశాలను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.మంచి అవకాశాలు వస్తే అందాలను ప్రదర్శించే విషయంలో తనకు ఎలాంటి సమస్య లేదని ఇలియానా చెప్పకనే చెబుతున్నారు.ఇలియానా అవకాశాలు వస్తే హాట్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఇలియానా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సినీ పరిశ్రమలో ఈ నిర్మాతల సంఘాలు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో టాప్ నటీనటులపై కూడా నిషేధం విధిస్తుంటారు. అలాగే ఇలియానా చేసిన ఓ పని వల్ల ఆమెను తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా బ్యాన్ చేశారు. టాలీవుడ్ఓ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నటి ఇలియానా ఓ తమిళ సినీ నిర్మాత నుంచి రూ.40 లక్షలు అడ్వాన్స్ గా అందుకుంది.