శంభాజీ చరిత్ర
Chhaava | బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద హిట్ కొట్టింది. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమాలో ఏసుబాయి పాత్రకు రష్మిక 100 శాతం న్యాయం చేసిందని ప్రేక్షకులు అన్నారు. కానీ సినిమాలో రష్మిక ఎంత అద్బుతంగా నటించినప్పటికి విక్కీ కౌశల్ ని బీట్ చేయలేక పోయింది. విక్కీ, శంభాజీ మహరాజ్ పాత్రలో జీవించేశాడని చాలా మంది అన్నారు. విక్కీ ఆ పాత్రకు ప్రాణం పోశాడాని.. నిజంగా శంభాజీ మహరాజ్ ఉండి ఉంటే ఇలా ఉండేవాడా అని అనుకునేల విక్కీ నటించడాని టాక్ వినిపించింది. ఈ సినిమా కోసం విక్కీ శారీరకంగా.. అలాగే మానసికంగా ఎంతగానో శ్రమించాడు.

ఈ సినిమా షూటింగ్ కి ముందే విక్కీ కత్తి శాము, యుద్దాలు, గుర్రపు స్వారీలలో శిక్షణ కూడా తీసుకున్నాడు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. “ఛావా”. మొదటిగా హిందీ ఒక్క భాషలోనే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం నార్త్ లో సెన్సేషనల్ వసూళ్లు అందుకుంది. అయితే ఈ చిత్రం హిందీ తర్వాత మరో భాషలో డబ్బింగ్ చేయాలి అనేది ఒక్క మన తెలుగులో తప్ప మరే భాషలో కూడా డిమాండ్ రాలేదు.ఇలా తెలుగులో మంచి డిమాండ్ తో ఎట్టకేలకి తెలుగులో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం తెలుగులో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇలా తెలుగులో మొత్తం ఇపుడు 5 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోగా పి ఆర్ నంబర్స్ ప్రకారం ఛావా మొత్తం 11.91 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
రికార్డు బ్రేక్ ..
దీనితో తెలుగులో కూడా ఛావా మంచి రన్ ని ప్రదర్శిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా మాడాక్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.కాగా, ‘ఛావా’ చిత్రం తాజాగా బాహుబలి-2 రికార్డును దాటేసింది. రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి-2 సినిమా బాలీవుడ్ లో రూ.510 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడా కలెక్షన్లను ‘ఛావా’ అధిగమించింది. కేవలం 25 రోజుల్లోనే రూ.516 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ గా బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ‘ఛావా’ 6వ స్థానంలో ఉంది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఛావా సినిమా త్వరలో ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : అలా చేస్తే నాగతో నటించలేను .. కండీషన్లు పెట్టిన స్టార్ హీరోయిన్
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 11న రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. మరో పక్క నెల్లూరు జిల్లాలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఏపీ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జిలా ఉల్ హకీ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.ఛావా సినిమా కారణంగా ఉత్తరాదిలో మత ఘర్షణలు జరిగాయని, ఏపీలోనూ అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబును అత్యంత క్రూరుడిగా చూపించారని, చరిత్రను వక్రీకరించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని ఉల్ హకీ ఆరోపించారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని లేని పక్షంలో ముస్లిం సంఘాల నేతలతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

బంగారం కోసం జోరుగా తవ్వకాలు
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో బంగారం కోసం తవ్వకాలు జరుగుతున్నాయి . మొఘల్ కాలం నాటి అసిర్‌గఢ్ కోట ప్రాంతం బంగారు గనిగా ఛత్రపతి శంభాజీ మహారాజ్‌పై తీసిన చావా చిత్రంలో చూపించారు.కాగా, జాతీయ రహదారి నిర్మాణం సందర్భంగా ఆ ప్రాంతంలోని ఒక దర్గా సమీపంలో జేసీబీతో మట్టిని తవ్వారు. స్థానిక గ్రామస్తుడి పొలంలో ఆ మట్టిని పోశారు. అయితే పురాతన కాలం నాటి లోహ నాణేలు ఆ మట్టిలో లభించినట్లు పుకార్లు చెలరేగాయి. దీనికి తోడు చావా చిత్రంలో ఈ ప్రాంతం గురించి ప్రస్తావించడంతో అక్కడ తవ్వకాలు జోరందుకున్నాయి.
సమీప గ్రామాలకు చెందిన ప్రజలు రాత్రివేళ అక్కడకు చేరుతున్నారు. టార్చిలైట్ వెలుతురులో తవ్వకాలు జరుపుతున్నారు. మొఘల్ కాలం నాటి బంగారం, వెండి నాణేలు తమకు దొరికినట్లు కొందరు చెప్పారు.మరోవైపు ఆ ప్రాంతంలో రాత్రివేళ జరుగుతున్న తవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రచారం ఉట్టిదేనని పోలీసులు, అధికారులు పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి పురాతన నాణేలు లభించలేదని చెప్పారు.
Also Read : బాక్స్ ఆఫీస్ లో దుమ్ములేపిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
వారసత్వ సంపద
రాజరాజేశ్వర ఆలయ నిర్వహణకు ఖర్చు చేసే మొత్తానికి సంబంధించి హిందూ జనజాగృతి సమితి దీనిని వివక్షతగా అభివర్ణించింది. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. దీని తర్వాత ఔరంగజేబు సమాధిని అక్కడి నుంచి తొలగించాలనే డిమాండ్ ఉంది. ఈ విషయం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఔరంగజేబు సమాధికి భారత పురావస్తు సర్వే శాఖ రక్షణ కల్పించిందని అన్నారు. ఈ పని చట్టపరమైన ప్రక్రియ కింద జరిగిందని చెప్పారు. కాబట్టి దీనిని తొలగించడానికి లేదా ఏవైనా మార్పులు చేయడానికి చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోలేమని ఆయన చెప్పారు.అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 42, 51ఏ(ఎఫ్)లు దేశ వారసత్వాన్ని కాపాడుకోవడం జాతీయ బాధ్యత అని పేర్కొన్నాయి.
అన్ని వారసత్వ ప్రదేశాలను సంరక్షించే బాధ్యత భారత పురావస్తు సర్వే సంస్థకు ఉంది. 1958 నాటి పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టంలో సెక్షన్ 4(1) ప్రకారం.. ఏదైనా చారిత్రక భవనం లేదా వారసత్వ ప్రదేశాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగ ప్రకారం, పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారం.. జాతీయ చారిత్రక వారసత్వం, భవనాలు, పత్రాలను సంరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. వారసత్వ సంపదకు హాని కలిగించే లేదా విధ్వంసం చేసే ప్రయత్నం జరిగితే రక్షణ కల్పించాలి. ఎవరైనా తొలగించడానికి లేదా ఏవైనా మార్పులు చేయడానికి ప్రయత్నిస్తే రక్షణ కల్పించాల్సి ఉంటుంది.