Raghavendra Rao | సవతి తల్లి కోసం రాఘవేంద్ర రావు చేసిన పనికి అంతా షాక్ ..

Raghavendra Rao | దాదాపు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా రాఘవేంద్ర రావుకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది నటీనటులను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలు తీయడంలోనూ ఆయనది ప్రత్యేకశైలే. రొమాంటిక్ పాటలకు ఆయన ఎంత పేరో.. అలాగే భక్తిరస చిత్రాలు తీయడంలోనూ దిట్ట. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి సినిమాలతో తెలుగుసినిమా చరిత్రలో ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు రాఘవేంద్రరావు. ప్రస్తుతం ఆయన సినిమాలు బాగా తగ్గించేశారు.

ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో ‘పెళ్లి సందD’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా తీయలేదు.తాజాగా దర్శకుడు రాఘవేంద్ర రావు మరో కొత్త ప్రయోగాన్ని మొదలుపెట్టారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూసే యువత కోసం వారధి కావడానికి ఆయనే స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేశారు.

Raghavendra-Rao-help-to-varalakshmi-son

చిత్రపరిశ్రంలో దర్శకేంద్రుడుగా గుర్తింపు పొందిన కె.రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన అనేక వైవిధ్యభరితమైన సినిమాలను రూపొందించారు. ఎంతోమంది స్టార్ హీరోలుగా చేయడంతో పాటు ఇంతో మందికి నటన నేర్పించి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు.రాఘవేంద్రరావు అంటే ఒక బ్రాండ్ అలాగే అతడి కుటుంబం కూడా అంతే ఒక వంద మంది ఉంటారు.తన సోదరి మణులు, సోదరుడి కుటుంబం అందరూ కూడా తన కుటుంబమే.కుటుంబంలో చిన్న వాడే అయినా కూడా బాధ్యతలకు మాత్రం పెద్దవాడు.తన తండ్రి ప్రకాష్ రావు తన తల్లిని కాదని నటి వరలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

వరలక్ష్మికి ప్రకాష్ రావుకి ఏకైక సంతానం అతడి పేరు కూడా ప్రకాష్ రావు.సినిమా ఇండస్ట్రీలో పని చేశాడు మొదట్లో డివోపిగా ఆ తర్వాత దర్శకుడిగా మారాడు కానీ మోహన్ బాబుతో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత ఆయన అనుకోని కారణాల వల్ల చిన్న వయసులోనే కన్నుమూశాడు.ఆ తర్వాత కొన్నేళ్లపాటు వరలక్ష్మి జీవించి వృద్ధాప్య కారణాలతో ఆమె కూడా కళ్ళు మూసింది.నిజానికి తండ్రి ప్రకాష్ రావు ఆస్తిలో వరలక్ష్మి కుమారుడి కూడా వాటా ఉండాల్సింది.కానీ వరలక్ష్మి ప్రకాష్ రావు ని వదిలేసి ఒక పహల్వాన్ తో ప్రేమలో పడి అతని కోసం వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమెను పూర్తిగా ప్రకాష్ రావు కుటుంబం దూరం పెట్టింది.

వరలక్ష్మి సైతం మళ్లీ ప్రకాష్ రావు కుటుంబానికి దగ్గర కావాలని ఏనాడు అనుకోలేదు.అందుకే ప్రకాష్ రావు ఆస్తిలో అతడు ఆమె కుమారుడికి ఎలాంటి వాటా దక్కలేదు.అయితే ప్రకాశం గానే అతని భార్య పిల్లలు రోడ్డున పడతారని రాఘవేంద్ర రావు పెద్ద మనసు చేసుకొని వారిని పోషిస్తూ వచ్చాడు.ఇప్పటికి కూడా వారంతా ఆయన సంరక్షణలోనే ఉన్నారు ప్రపంచానికి సవతి తల్లి కొడుకు కుటుంబాన్ని సాకుతున్న విషయం ఏనాడో చెప్పలేదు రాఘవేంద్రరావు.అదే కదా గొప్పతనం అంటే ! అలాగే దివంగత ఎన్.టి.రామారావు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, ఆయనతో తాను తీసిన “అడవిరాముడు” చిత్రం తన కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసిందని దర్శకేందుడు కె.రాఘవేంద్ర రావు అన్నారు. ఆ సినిమా అప్పట్లో వంద రోజులు ఆడిందన్నారు. ఆ మూవీ షీల్డ్‌ను ఇప్పటికీ తన ఇంట్లో గుర్తుగా పెట్టుకున్నానని చెప్పారు.

ఆ తర్వాత ఎన్టీఆర్‌తో తాను అనేక చిత్రాలు తీశానని చెప్పారు. తన శిష్యుడుగా వచ్చిన రాజమౌళి ఇపుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. చిత్రపరిశ్రమకు రాజమౌళిని ఇచ్చాననే ఒక సంతృప్తి తనకు ఉందని, తనకు అది చాలని రాఘవేంద్ర రావు అన్నారు.కాగా, చిత్రపరిశ్రంలో దర్శకేంద్రుడుగా గుర్తింపు పొందిన కె.రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన అనేక వైవిధ్యభరితమైన సినిమాలను రూపొందించారు. ఎంతోమంది స్టార్ హీరోలుగా చేయడంతో పాటు ఇంతో మందికి నటన నేర్పించి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు. తాజాగా ఆయన పర్యవేక్షణలో కథాసుధ అనే వెబ్ సిరీస్ రూపొందింది. ఇది ప్రముఖ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రసార కార్యక్రమాల్లో భాగంగా ఆయన పైవిధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Leave a Comment