Trisha Krishnan | త్రిష పర్సనల్ లైఫ్ గురించి ఇది మీకు తెలుసా .. ​

Written by admin

Published on:

Trisha Krishnan | అందాల తార త్రిష తెలుగు, తమిళ సినిమాల్లో తన అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి త్రిష. తెలుగులో త్రిషకు వ‌ర్షం సినిమాతో మంచి పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదించుకుంది . వర్షం సినిమా త‌ర‌వాత త్రిష రేంజ్ పెరిగింది. స్టార్ హీరోల సరసన నటించి ఆనతి కాలంలోనే నెంబర్ 1 పొజిషన్ కు చేరుకున్న ఈ భామ సీనియ‌ర్, జూనియ‌ర్ హీరోలు అనే తేడా లేకుండా అంద‌రి స‌ర‌స‌న న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా తన సత్తా చాటింది.

త్రిష పర్సనల్ లైఫ్.

ఇంకా నిజం చెప్పాలి అంటే దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తోన్న త్రిష ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చకుంటూ ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతుంది. ఇటీవల మణిరత్నం డైరెక్షన్లో రూపొందిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.ఆ సినిమాలో అందాల తార ఐశ్వర్యారాయ్ ఉన్నప్పటికీ త్రిష అందం ముందు తను తేలిపోయింది. ఏజ్ 40కి దగ్గరపడ్డా తన అందం రోజురోజుకు పెరిగిపోతుందేమో అన్నట్లుగా ఉంది. పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష కుందువై పాత్రలో అద్భుతంగా కనిపించింది.

Trisha Krishnan

ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ తో కలిసి లియోలో నటించింది.ఇక ఆమె పర్సనల్ లైఫ్​విషయానికొస్తే వయసు 40కు చేరువైన ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే త్రిష పలువురితో లవ్ అఫైర్ నడిపినట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి.రానా దగ్గుపాటి, ధనుశ్, విజయ్ దళపతి సహా పలువురితో త్రిష సన్నిహితంగా ఉన్నట్లు బయట కథనాల్లోనూ రాసి ఉంది.ఇదిలా ఉంటే, త్రిషకు 2015లో వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే, మూడు నెలల తరవాత ఈ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు.

అంతేకాకుండా వరుణ్ మణియన్ నిర్మిస్తున్న సినిమా నుంచి కూడా త్రిష తప్పుకున్నారు. ఆ తరవాత 2020లో త్రిష పెళ్లి రూమర్లు చక్కర్లు కొట్టాయి. తమిళ హీరో శింబుతో త్రిష పెళ్లి జరగనుందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ రూమర్లను శింబు తల్లిదండ్రులు ఖండించారు. ప్రస్తుతం శింబుకి సంబంధాలు చూస్తున్నామని.. అతను ఎవరితోనూ డేటింగ్‌లో లేడని స్పష్టం చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు త్రిష పెళ్లిపై రూమర్లు వచ్చాయి. ప్రస్తుతం త్రిష వయసు 40 ఏళ్లు.

బ్రేకప్ తర్వాత లైఫ్

వరుణ్‌తో బ్రేకప్ తర్వాత లైఫ్ ప్లానింగ్ ఎలా వుంది ? మళ్లీ ప్రేమలో పడే ఆలోచన ఏమైనా వుందా అనే విషయాలని ఆరాతీసింది. దీనిపై స్పందించిన త్రిష.. కచ్చితంగా మరో వ్యక్తితో ప్రేమలో పడటానికి సిద్ధంగా వున్నాను అని బదులిచ్చింది. అయితే ఆ ప్రేమ సొసైటీ కోసమో లేక జీవితంలో ఏదో ఓ రోజు పెళ్లి చేసుకోవాలి కనుక ప్రేమిద్దాం అన్నట్లుగా కాకుండా తనకి నచ్చిన మనిషి కనిపిస్తే కచ్చితంగా ప్రేమలో పడతానని స్పష్టంచేసింది త్రిష.నేను చాలా మందితో డేటింగ్ చేశాను. రిలేషన్‌షిప్ పెట్టుకున్నాను.

కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో లైఫ్​ఎప్పుడూ సంతోషంగా ఉండదు. పెళ్లి అనేది ఓ బాధ్యత. అది నా వల్ల కాదు అనే అనుమానం కూడా ఓ దశలో వచ్చింది. కానీ ఇప్పుడున్న వయసులో కచ్చితంగా నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటున్నాను. సెల్ఫ్ లవ్ చాల ముఖ్యం. అది చాలా బాగుంటుంది. ఒకరి కోసం జీవించడం కన్నా మన కోసం మనం జీవించినప్పుడే లైఫ్​కు ఓ అర్థం ఉంటుంది అని ఆమె చెప్పినట్లు కథనాల్లో రాసి ఉంది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న త్రిష ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Also Read :  పాపం ఐదేళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న గంగవ్వ

నయనతార త్రిష ఇక ఈ ఇద్దరు తారలు స్టార్లు గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపు ఊపేశారు. అంతే కాదు ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులు గా ఉన్నారు. ఇక వీరి మధ్య విభేదాలకు సబంధించిన త్రిష ఓ సందర్భంలో స్పందిస్తూ… క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో త్రిష ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ తనకు, నయనతారకు సమస్య ఉన్న మాట వాస్తవమే అని అన్నారు.

Trisha Krishnan

అయితే ఈ విభేదాలు వృత్తిపరమైన కారణాల వల్ల వచ్చినవి కాదని.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని, సమయం గడిచేకొద్దీ మేము ఒకరినొకరు అర్థం చేసుకున్నామని త్రిష చెప్పింది. ఇప్పుడు మనం స్నేహితులం అని కూడా త్రిష అన్నారు. అయితే వీరిమధ్య విబేధాలకు కారణం ఓ సినిమా అని తెలుస్తోంది. గతంలో నయనతార కురువి సినిమాలో మొదటగా నటించిగా.. ఆ అవకాశం నయనతార నుంచి త్రిషకు వెళ్లింది.

తాజాగా ఈ భామ సోషల్ మీడియా అకౌంట్‌ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది. ప్రస్తుతానికి నేను నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలియాలను కోవడం లేదు.ఇది నాకు, నా అభిమానులకు మధ్య డిజిటల్ చికిత్స లాంటిది. లవ్ యు గయ్స్.. త్వరలోనే మళ్లీ త్వరలోనే కలుద్దాం అన్నారు త్రిష. దక్షిణాదిలో గత పదిహేనేళ్లుగా కథానాయికగా కొనసాగుతున్న త్రిష.. తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమా ద్వారా పరిచయం అయింది ప్రస్తుతం స్టార్ రేంజ్ లో ఉంది.

త్రిష ఆస్తి కోట్లలో…

కోట్లలో ఆస్తిని కూడబెట్టేశారు త్రిష.ప్రస్తుతం త్రిష (Trisha) ఏడాదికి దాదాపు రూ.10 కోట్లకు పైగా సంపాదిస్తోంది. ఈ అమ్మడికి చెన్నైలో రూ.7 కోట్లు విలువ చేసే విలాసవంతమైన భవనం ఉందట. అలాగే హైదరాబాద్‌లో రూ.6 కోట్ల విలువైన ఇల్లు.. ఇక రూ.80 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్, రూ.75 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 5 సిరీస్, రూ.60 లక్షల రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. ఇవి కాకుండా త్రిష ఇప్పటివరకు రూ.85 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్న త్రిష గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈమెకు చెన్నైలో ఉన్నటువంటి ఒక ఇంటిని సీనియర్ స్టార్ హీరో భానుచందర్ కు అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భానుచందర్ వెల్లడించారు. ఈ ఇల్లు త్రిషది అని కొన్ని సంవత్సరాల క్రితం తాను ఎనిమిది కోట్ల రూపాయలకు కొనుగోలు చేశానని తెలిపారు. ఇలా ఈ ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత నా భార్య ఈ ఇంటిని మరింత చక్కగా అందంగా తీర్చిదిద్దని భానుచందర్ వెల్లడించారు.Trisha Krishnan

ఈ విధంగా త్రిష తన ఇంటిని భానుచందర్ కు అమ్మారనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఒక్కో సినిమాకు ప్రస్తుతం 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకొనే త్రిష ఈ ఇంటిని ఎందుకు అమ్మారు అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక త్రిష ప్రస్తుతం తమిళ సినిమాలతో పాటు తెలుగులో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత మరోసారి విశ్వంభర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.Trisha Krishnan

Also Read : తారక్ భార్య ఎన్ని కోట్ల కట్నం తెచ్చిందో తెలుసా?

త్రిష ఫిట్ నెస్..

త్రిష బ్యూటీ సీక్రెట్ కూడా ఇదే. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆమె ఒక గంట సేపు కార్డియోతో పాటు వ్యాయామం కూడా చేస్తుంది. ఆహార విషయంలో కూడా ఆమె చాలా నియమాలు పాటిస్తుంది. పండ్లు కూరగాయలు పుష్కలంగా తినాలి అని చెబుతోంది త్రిష. అయితే మనం తినే పండ్లు కూరగాయలలో కూడా విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అవే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా సహాయపడతాయి.అన్నిటికంటే ముఖ్యంగా రాత్రి డిన్నర్ చాలా త్వరగా పూర్తి చేయాలి అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. త్రిష పండ్లు, కూరగాయలను పుష్కలంగా తింటుంది.

ఈమె తినే పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండేలా చూస్తుందట. ఇవి ఆమె శరీరాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి.త్రిష వీలైనంత తొందరగా డిన్నర్ కంప్లీట్ చేస్తుంది. ప్రతిరోజు వీటిని చేయడం వల్లే శరీరంలో ఉన్న ఎక్స్ట్రా క్యాలరీలు కూడా త్వరగా కరిగిపోతాయి అని.. అవే మనం బరువు పెరగకుండా చేస్తాయి అని.. అదే తన ఫిట్నెస్ సీక్రెట్ అని రివీల్ చేసింది త్రిష.Trisha Krishnan

Trisha Krishnan

ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్న త్రిష గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈమెకు చెన్నైలో ఉన్నటువంటి ఒక ఇంటిని సీనియర్ స్టార్ హీరో భానుచందర్ కు అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భానుచందర్ వెల్లడించారు. ఈ ఇల్లు త్రిషది అని కొన్ని సంవత్సరాల క్రితం తాను ఎనిమిది కోట్ల రూపాయలకు కొనుగోలు చేశానని తెలిపారు. ఇలా ఈ ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత నా భార్య ఈ ఇంటిని మరింత చక్కగా అందంగా తీర్చిదిద్దని భానుచందర్ వెల్లడించారు.

ఇంటిని ఎందుకు అమ్మారు

ఈ విధంగా త్రిష తన ఇంటిని భానుచందర్ కు అమ్మారనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఒక్కో సినిమాకు ప్రస్తుతం 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకొనే త్రిష ఈ ఇంటిని ఎందుకు అమ్మారు అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక త్రిష ప్రస్తుతం తమిళ సినిమాలతో పాటు తెలుగులో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత మరోసారి విశ్వంభర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

త్రిష హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 23 సంవత్సరాలు పైనే అవుతోంది. అయినప్పటికీ కూడా తన అందం అభినయంతో బాగా ఆకట్టుకుంటూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అనే ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.అయితే దీనిపై త్రిష తాజాగా కీలక ప్రకటన చేసింది. తాను రాజకీయాల్లోకి రాబోనని వెల్లడించారు. తనకు ఇప్పుడు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదన్నారు త్రిష. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఖండిస్తున్నట్లు చెప్పారు.Trisha Krishnan

🔴Related Post

Leave a Comment