Prakash Raj | ప్రకాష్ రాజ్ కి టాలీవుడ్ లో అవకాశాలు లేనట్టేనా.. మెగా ఫ్యామిలీ టార్గెట్ చేస్తే అంతె

Prakash Raj | గతంలో ప్రకాష్ రాజ్ కు అండగా నిలిచిన మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ కు దాదాపుగా దూరమైనట్టేనని చెప్పవచ్చు. ప్రతిభ ఉన్నా లౌక్యం లేకపోవడం వల్ల ప్రకాష్ రాజ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ పై పలు సందర్భాల్లో అనధికారికంగా బ్యాన్ విధించారు. వివాదాల వల్ల కొందరు దర్శకులు ప్రకాష్ రాజ్ కు ఇప్పటికే అవకాశాలు ఇవ్వడం లేదు.నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా ప్రకాష్ రాజ్ (Prakash Raj) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు తన సక్సెస్ రేట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. దేవర (Devara) సినిమాలో సింగప్ప అనే పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ తన నటనతో పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి.

అయితే ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ కామెంట్లు చేసిన నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ కు ఆఫర్లు రావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) కూడా మెగా ఫ్యామిలీ పట్ల పెద్ద ఎత్తున సంచలన పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.ముఖ్యంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పట్ల ఈయన చేసే పోస్టులు సంచలనంగా మారాయి.తిరుపతి లడ్డు ( Tirupathi Laddu ) వ్యవహారంలో ఈయన పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Prakash Raj
Prakash Raj

ఇలా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేయడంతో మెగా ఫ్యామిలీ ఈయనని టార్గెట్ చేశారని తెలుస్తుంది.తనని టాలీవుడ్ ఇండస్ట్రీ (Tolly Wood) నుంచి బాయ్ కాట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.కేవలం మెగా హీరోల సినిమాలలో మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు కూడా ఈయనకు అవకాశాలు కల్పించకూడదని దర్శక నిర్మాతలకు మెగా సూచనలు వెళ్లాయని తెలుస్తుంది.ప్రకాష్ రాజ్ విషయంలో మెగా ఫ్యామిలీ తీసుకున్న ఈ నిర్ణయంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇప్పటికైనా ప్రకాష్ రాజ్ లో మార్పు వస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రకాష్ రాజ్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉంది. ప్రకాష్ రాజ్ రెమ్యునరేషన్ కోటిన్నర రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

Prakash Raj
Prakash Raj

మరో పక్క బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన గురువారం వీడియో విడుదల చేశారు. తాను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతున్నట్లు తనకు తెలిసిందన్నారు. 2016లో ఆ యాడ్ సంస్థ తన వద్దకు వచ్చిందని చెప్పారు. అయితే తాను ఈ యాడ్ చేసిన మాట వాస్తమని ఆయన ఒప్పుకున్నారు. ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తాను తెలుసుకున్నానన్నారు. 2017లో ఆ ఒప్పందాన్ని పొడిగిస్తామని ఆ యాడ్ సంస్థ వారు తనను కోరారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కానీ ఆ యాడ్‌ను ప్రసారం చేయవద్దని వారిని తాను కోరినట్లు తెలిపారు. 9 ఏళ్ల కిందట ఏడాది ఒప్పందంతో ఆ యాడ్ చేశానని ప్రకాష్ రాజ్ వివరించారు.

Also Read : సవతి తల్లి కోసం రాఘవేంద్ర రావు చేసిన పనికి అంతా షాక్ ..

Leave a Comment