Anchor Suma | మీకు తెలుసా .. ఒక్క షో కోసమే 5000 చీరలు కట్టిన యాంకర్ సుమ ..

Written by admin

Published on:

యాంకరింగ్‌ కెరీర్ మొదలు..

Anchor Suma | టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ (Suma) గత రెండు దశాబ్దాలుగా నంబర్ వన్ యాంకర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సుమకు గతంతో పోల్చి చూస్తే ఆఫర్లు తగ్గినా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం తగ్గలేదు.నిజానికి మలయాళీ అమ్మాయి అయినా తన మాటలతో, షోలలో తన కబుర్లతో, ఈవెంట్స్ లో తన వాగ్దాటితో దాదాపు గత 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ తెలుగు వారిళ్ళల్లో ఒక ఆడపడుచు అయ్యింది యాంకర్ సుమ కనకాల.. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టీవీ టాక్ షోలైనా.. గేమ్ షోలైనా.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుమ. స్టార్ హీరోలు సైతం సుమకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అంతలా ఆమె చలాకీగా తెలుగులో మాట్లాడుతూ.. యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్నారు.

ఇక సుమ పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించారు. 2006లో ‘అవాక్కయ్యారా…’అనే ప్రోగ్రాంతో యాంకరింగ్‌ కెరీర్ మొదలు పెట్టరు సుమ.అంతకు ముందు సినిమాల్లోనూనటించారు సుమ నటించిన తొలి సినిమా ఎదో తెలుసా..? సుమ హీరోయిన్ గా నటించిన తొలి సినిమా కళ్యాణ ప్రాప్తిరస్తు. దాసరి నారా యణరావు దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ గా నటించారు సుమ. ఆ తర్వాత మలయాళంలో కూడా రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు సుమ.అయితే యాంకరింగ్ లోకి వచ్చిన తర్వాత సినిమాల పైన అంత మక్కువ చూపలేదు సుమ. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ ఆమె ఎక్కువగా యాంకరింగ్ పైనే దృష్టి పెట్టారు. రీసెంట్ గా జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించారు.ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

Anchor Suma
Anchor Suma

సుమ ఈవెంట్ రెమ్యునరేషన్..

సుమ తన కెరియర్ మొత్తంలో కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా కలిపి దాదాపు 100 కోట్లకు చేరువవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.సుమ యాంకరింగ్ చేస్తే ఆ ఈవెంట్ సూపర్ సక్సెస్ పక్కా. బట్ సుమతో యాంకరింగ్ అంటే అంత చిన్న విషయం కాదు. రెమ్యునరేషన్ లకారాల్లోనే ఉంటుంది. ఓ ఏడాది క్రితం సుమ రెమ్యునరేషన్ ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం నాలుగు లకారాలు పైనేనట.అంటే అక్షరాల నాలుగు లక్షలు. తక్కువలో తక్కువ రెండు లక్షలు ఇస్తే కానీ ఈవెంట్ చేయదట.చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు.. నాలుగు లక్షలు రెమ్యునరేషన్ ఉంటేనే ఈవెంట్ మేనేజర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట సుమ. అలాగని చివరి నిమిషంలో వచ్చి ఈవెంట్ చేయమంటే కుదరదు.. ఆమె డేట్స్ ముందే తీసుకోవాలి.

కనీసం పది రోజులు ముందైనా డేట్ ఫిక్స్ చేసుకోవాలి.సుమ మొదటి నుంచి కష్టపడింది అంతా స్థలాలు, ఇల్లులు, బంగారం , షేర్స్ పై పెట్టుబడులుగా మార్చేసిందట. ఇంచుమించు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవన్నీ కలగలిపితే దాదాపు 100 కోట్ల పై మాటగానే తెలుస్తుంది. అయితే యాంకర్ సుమ తన టోటల్ ఆస్తి మొత్తం తన ఇద్దరు బిడ్డలపైనే రాసుకొచ్చిందట.సుమ తర్వాత తన ఆస్తి మొత్తం తన కూతురు మనశ్విని, తన కొడుకు రోషన్ ఇద్దరికీ చెందాలని సుమ ముందుగానే దానికి తగ్గ పేపర్స్ ను రెడీ చేసుకుందట.రాజీవ్ కు ఒక్క రూపాయి చెందకుండా సుమ పకడ్బందీగా అగ్రిమెంట్ రాసిందట . గతంలో కూడా మనకు తెలిసిందే. గతంలో సుమ, రాజీవ్ కనకాల విడిపోతున్నారంటూ వార్తలు వినిపించాయి.

అదంతా ఫేక్..

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి వస్తోన్న ఫేక్ న్యూస్ పై ఆమె రియాక్ట్ అయ్యింది. కేరళలో రూ.278 కోట్లతో స్టార్ యాంకర్ సుమ ఒక లగ్జరీ ఇల్లు కట్టుకున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఒక పెద్ద లగ్జరీ హౌస్ ను చూపిస్తూ.. వెనుక ఒక అమ్మాయి వాయిస్ సుమ గురించి చెప్పుకుంటూ వస్తుంది. సుమ ఇల్లు కేరళలో ఎలా ఉందో చూద్దాం అంటూ మొదలుపెట్టిన ఆమె.. ఆ ఇల్లు విలువ రూ.278 కోట్లని, ఈ ఇంట్లో 500 సీసీ కెమెరాలు ఉన్నాయని, పదిమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారని చెప్పుకొచ్చింది.

ఇప్పుడు ఇదే వీడియోపై సుమ స్పందించింది.ఎవర్రా మీరంతా .. నేనెప్పుడు కట్టానురా ఇంత పెద్ద ఇల్లు. నేను కేరళలో ఎలాంటి ఇల్లు కట్టించలేదు. ఇదంతా ఫేక్. 2018 లో రూ.278 కోట్లతో కట్టానని ఈ వీడియోలో ఉంది. అసలు రూ.278 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయమ్మా.. ఏమనుకుంటున్నావమ్మా నువ్వు? నేనేమైనా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా అని ఫైర్ అయ్యారు .మేము సెలబ్రిటీస్.. మా అంతట మేమే వచ్చి మాట్లాడితే తప్ప ఇలాంటి వార్తలను నమ్మకండి. ఇక ఇప్పుడు AI కూడా వచ్చింది. ఇప్పుడు మా పెదాలు చూసి నిజంగా మేమే మాట్లాడుతున్నామా అని నిర్ధారించుకోండి అని సుమా అన్నారు.

Also Read : ‘దేవర’లో తారక్ భార్యగా కనిపించిన ఈమె వయస్సు ఎంతో తెలుసా..?

రాజీవ్ తో పెళ్లి లైఫ్ ..

ఇక సుమ పర్సనల్ లైఫ్ గురించి తెలిసిందే. ఆమె భర్త సినీ నటుడు రాజీవ్ కనకాల.1994 వ సంవత్సరంలో సుమకు ప్రేమ సందేశాన్ని పంపాడు. దాదాపు 5 ఏళ్ల తర్వాత 1999 లో వారి ప్రేమ పెళ్లి జరిగింది. వీళ్ళ ప్రేమ పెళ్లి కూడా అంత ఈజీగా జరగలేదు. వారి మధ్య ప్రేమ గురించి రాజీవ్ కనకాల తల్లిదండ్రులకు మొదట సుమే చెప్పింది. వారి పెళ్లికి దేవదాస్ కనకాల ఓ కండిషన్ కూడా పెట్టారు. ఆ విషయాలను దేవదాస్ కనకాల గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము’ అని ఓ రోజు సుమ నాకు ఫోన్ చేసి చెప్పింది.పెళ్లి సమయంలో తాళి కట్టేటప్పుడు రాజీవ్​మూడుముళ్లు వేశాక నాలుగో ముడి కూడా వేసేశాడని చెప్పింది సుమ.

ఆడపడుచు వేయాల్సిన ముడిని కూడా ఆయనే వేసేశాడని తెలిపింది. ఎంతో కష్టపడి ప్రేమించాను కదా అందుకే ఆ ముడి కూడా నేనే వేస్తానుంటూ అలా చేశాడని చెప్పుకొచ్చింది.పెళ్లి సమయంలో తాళి కట్టేటప్పుడు రాజీవ్​మూడుముళ్లు వేశాక నాలుగో ముడి కూడా వేసేశాడని చెప్పింది సుమ. ఆడపడుచు వేయాల్సిన ముడిని కూడా ఆయనే వేసేశాడని తెలిపింది. ఎంతో కష్టపడి ప్రేమించాను కదా అందుకే ఆ ముడి కూడా నేనే వేస్తానుంటూ అలా చేశాడని చెప్పుకొచ్చింది. ఇంకా ఈ జంట ఈ మద్య పెళ్లి రోజు సందర్భంగా తమ యానివర్సరీని.. దగ్గర్లోని వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడే కేక్ కట్ చేసి జరుపుకుంది. అన్నదానం కూడా చేసింది.

5000 చీరలు..

గతంలో ఈమె ఈ టీవీలో స్టార్ మహిళ అనే కార్యక్రమాన్ని కొన్నివేల ఎపిసోడ్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ కార్యక్రమం గురించి సుమ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ షో కోసం తాను కేవలం సారీస్ మాత్రమే కట్టుకున్నానని తెలిపారు.అయితే ఈ ఒక్క షో కోసమే నేను 5000 చీరలు కట్టానని సుమ తెలియజేశారు. దీనితో పాటు స్వరాభిషేకం కార్యక్రమానికి మరొక 1500 చీరలు కట్టానని సుమా తెలిపారు. ఇలా ఈ రెండు కార్యక్రమాలకు 6500 సారీస్ కట్టుకున్నానని సుమ (Suma) ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anchor Suma
Anchor Suma

యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో నిర్మల కాన్వెంట్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు రోషన్. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలతో మెప్పించిన దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ కనకాల ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా రోషన్ కనకాల మొదటి సినిమా టైటిల్ ని రాజమౌళి లాంచ్ చేశారు.రోషన్ కనకాల మొదటి సినిమా టైటిల్ ‘బబుల్ గమ్’ అని ప్రకటిస్తూ..రాజమౌళి రోషన్ డెబ్యూట్ కి కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్స్ హత్తుకొని ఉండగా హీరో నోట్లోంచి బబుల్ గమ్ తో బెలూన్ ఊదుతున్నాడు. రొమాంటిక్ లుక్ లో ఈ పోస్టర్ ఉంది. ఇక ఈ సినిమాలో మానస చౌదరి అనే తమిళమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా ఉంది. మరి రోషన్ కనకాల ఈ బబుల్ గమ్ తో ఎలా మెప్పిస్తాడా చూడాలి.

Also Read : వడ్డే నవీన్ భార్య కి నందమూరి కుటుంబానికి ఉన్న బంధం ఇదే .

యాంకర్ సుమ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. గతంలో సుమ చేసిన ఓ యాడ్ కారణంగా పలువురు సామాన్యులు ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామంటూ వాపోతున్నారు. రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెంచర్‌కి సంబంధించిన యాడ్‌లో సుమ చెప్పినందుకే తాము ఫ్లాట్స్ కొన్నామని.. ఇప్పుడు పూర్తిగా మోసపోయామంటూ బాధితులు చెబుతున్నారు.రాకీ అవెన్యూస్ అనే సంస్థతో తాను 2016 నుంచి 2018 వరకు మాత్రమే ఒప్పందం చేసుకున్నానని.. ఆ సమయంలోనే వారికి సంబంధించిన ప్రమోషనల్ యాడ్ చేశానని సుమ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇప్పుడు ఆ సంస్థతో తనకు ఎలాంటి లావాదేవీలు, సంబంధం కానీ లేదని.. తనకు సంబంధించిన వీడియోను వారు అక్రమంగా వినియోగించుకున్నారని సుమ తెలిపింది.

Anchor Suma
Anchor Suma

షో లు చేయడం లేదు..

ఒకానొక సమయంలో సుమ పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసేవారు కానీ ఇటీవల కాలంలో ఈమె ఒక షో మినహా మిగిలిన ఏ ఛానల్లో కూడా బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడం లేదు.ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి సుమ సినిమా వేడుకలలో మాత్రం ఎంతో బిజీగా గడుపుతున్నారు.తాజాగా తన భర్త రాజీవ్ కొన్ని కామెంట్స్ చేశారు సుమ కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలను మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని 6 గంటలకల్లా ఇంటికి వచ్చేదని ఒకవేళ రానిపక్షంలో పిల్లలని కూడా తన వెంటే తీసుకు వెళ్లేదని ఈయన తెలిపారు.

🔴Related Post

Leave a Comment