Anushka Shetty | అనుష్క ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అతనేనా..?

Written by admin

Published on:

కెరీర్ లో అనుష్క

Anushka Shetty | గ‌త కొన్ని నెల‌లుగా అనుష్క పెళ్లి వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే వుంది. ఈ వార్త‌ల‌పై నెటిజ‌న్స్ ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఆమె ఫ్యాన్స్‌ తో ఇంట‌రాక్ట్ అయిన ప్ర‌తీ సంద‌ర్భంలోనూ ఈ విష‌యంపై క్లారిటీ కోసం ప్ర‌య‌త్నిస్తూనే వున్నారు.కాసేపు అది పక్కన పెడితే అరుంధతి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని స్టార్ హీరోలకు పోటీగా నిలిచింది అనుష్క. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఈమె రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కి పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత అన్ని వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తుందని అనుకున్నారు.

కానీ సరైన అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. ముఖ్యంగా బిల్లా వంటి చిత్రాలలో బికినీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. సాంప్రదాయంగా కనిపించి మెప్పించిన చిత్రాలు కూడా ఉన్నాయి. బాహుబలి తర్వాత నిశ్శబ్దం , భాగమతి, సైజ్ జీరో లాంటి సినిమాలలో నటించింది. సైజ్ జీరో సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన అనుష్క గత ఏడాది మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది .ఈ సినిమా తర్వాత సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 19 ఏళ్ల తర్వాత మలయాళం ఇండస్ట్రీలోకి తొలిసారి అడుగు పెట్టబోతోందిఅనుష్క.

Anushka Shetty
Anushka Shetty

నిజానికి చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లపై గాసిప్స్‌ సాధారణంగానే ఎక్కువగా వస్తుంటాయి. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ గాసిప్స్‌ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా డేటింగ్‌, పెళ్లిళ్లు, విడాకులంటూ సినీతారలకు సంబంధించిన వార్తలు వస్తుంటాయి. ఇక స్టార్స్‌ విషయంలో ఇంకాస్త ఎక్కువగానే వస్తాయి. చిత్ర పరిశ్రమ అనేది ఓ కలల ప్రపంచం. చాలామంది కెరీర్‌పైనే దృష్టి సారిస్తుంటారు. వయసు పెరుగుతున్నా పెళ్లి ప్రస్తావన తీసుకురారు. అయినా, సార్ట్‌ హీరోయిన్ల విషయంలో ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వార్త వైరల్‌ అవుతున్నది. బాహుబలి బ్యూటీ అనుష్క శెట్టి పెళ్లి వార్త మరో తెరపైకి వచ్చింది. అనుష్క 40 ఏళ్లు పైబడిన కూడా పెళ్లి చేసుకోవడం లేదు అని ఆమె తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు.

పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం

అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ అనుష్కపెళ్లి చేసుకోకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయట.మరి ఇంతకీ అనుష్క పెళ్లీడు దాటిపోయినా కూడా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు.. ఇప్పటి వరకు అనుష్క ఎంత మందితో లవ్ ట్రాక్ చేసింది అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం..కేవలం నాగార్జున మాత్రమే కాదు నాగ్ కొడుకు నాగచైతన్యతో పెళ్ళంటూ కూడా వార్తలు వస్తే నాగార్జున ఆ వార్తలపై ఫైర్ అయ్యారు. ఇక నాగార్జున తర్వాత హీరో గోపీచంద్ తో కూడా ఈమెకు ప్రేమ వార్తలు వినిపించాయి. కానీ అది కూడా రూమర్స్ గానే మిగిలిపోయాయి.ఆ తరువాత ప్రభాస్‌ తో అనుష్క వివాహం అంటూ వ‌స్తున్న పుకార్లను ఆమె ఖండించినప్పటికీ ఈ జంట ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారుతూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతూనే వుంది.

Also Read : నాకు ఆరుగురు భర్తలు .. నటి అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్ ,

ఈ నేప‌థ్యంలో అనుష్క వివాహం గురించి తన అభిప్రాయాన్ని దృక్పథాన్ని స్పష్టం చేసింది. అనుష్క‌ మాట్లాడుతూ పెళ్లిని నమ్ముతున్నాను. పిల్లలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ విష‌యంలో నాకు ఎలాంటి తొంద‌ర లేదు. చాలా టైమ్ తీసుకుని నాకు న‌చ్చిన వాడు ఎదురుప‌డిన‌ప్పుడే వివాహం చేసుకోవాల‌నుకుంటున్నాను అని తెలిపింది. వివాహంపై తల్లిదండ్రుల ఒత్తిడి గురించి మాట్లాడిన అనుష్క తనకు 20 సంవత్సరాల వయస్సు నుండి తన తల్లిదండ్రులు వివాహం కోసం ఒత్తిడి తెచ్చారని స్ప‌ష్టం చేశారు. అయితే పెళ్లి కోసం తన తల్లిదండ్రులు ఇప్పుడు ఒత్తిడి చేయడం మానేశారని ఆమె తెలిపింది. తన కెరీర్ కొనసాగించడానికే ఆసక్తిగా ఉంద‌ట‌. ఇటీవల‌ మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా ఆమెకు సినిమాల నుంచి త‌ప్పుకోవాల‌ని లేద‌ని స్పష్టం చేశారు.

Anushka Shetty
Anushka Shetty

వింత వ్యాధితో అనుష్క..

తన జీవితంలో మర్చిపోలేని అతి పెద్ద విక్టరీ అందించిన అరుంధతి సినిమాతో టాలీవుడ్ జేజమ్మగా మారిపోయింది అనుష్క శెట్టి. ఇక ఆ తర్వాత బాహుబలి సినిమాతో అనుష్క ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ మొదట నుష్క శెట్టి అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. సూపర్ సినిమా కొట్టడంతో ఆ తర్వాత అనుష్కకు వరుస అవకాశాలు దక్కాయి. హీరోలకు కావాల్సిన హైట్, ఫిజిక్ తో పాటు మంచి నటన ప్రతిభ ను కనబరచడంతో ఎన్నో చిత్రాల్లో అవకాశాలు లభించాయి. అలా వరుస చిత్రాల్లో హిట్స్, ఫ్లాప్ అని సంబంధం లేకుండా నటిస్తూ వచ్చింది అనుష్క.

ఆస్తుల విలువ..

అలాగే ప్రభాస్, డైరెక్టర్ క్రిష్, డైరెక్టర్ రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి తో కూడా అనుష్క ప్రేమలో పడ్డట్టు అప్పుడు వార్తలు వచ్చాయి అయితే ప్రభాస్ మరియు హీరోయిన్ అనుష్క ఇద్దరు ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరూ ఎక్కడా కూడా తమ ప్రేమ విషయాన్ని వెల్లడించలేదు. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని మాత్రం వార్తలు బాగా వైరల్ అయ్యాయి.అయితే ఇలాంటి వార్తలు గత పది సంవత్సరాలుగా వచ్చినప్పటికీ… ప్రభాస్ మరియు అనుష్క మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. అసలు పెళ్లి విషయంలో వీరు పెదవి విరవడం లేదు.చూడాలి చివరికి ఏం జరుగుతుందో.

ఇంకా అనుష్క ఎన్నో సినిమాల్లో న‌టిస్తూ కోట్లాది రూపాయ‌ల ఆస్తులు కూడ‌బెట్టుకుంది.పలు నగరాల్లో అనుష్కకు విలువైన బంగళాలు, ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది.అనుష్క (Anushka) ఆస్తుల్లో ఓ ఇంటి విలువ 12 కోట్లు ఉందట. ఖరీదైన కార్ల విలువ కొన్ని కోట్ల విలువ చేస్తుందని వారు రాసుకొచ్చారు. ఇందులో భాగంగా టొయోటా కొరొల్లా ఆల్టిస్ -21ల‌క్ష‌లు, ఆడి ఏ 6 విలువ‌- 56 ల‌క్ష‌లు, ఆడి క్యూ 5 – 62 ల‌క్ష‌లు, బీఎండ‌బ్ల్యూ 6 సిరీస్ కార్ – 67ల‌క్ష‌లు పెట్టి కొనుగోలు చేసింది.ఇక ఆమె సొంత రాష్ట్రం బెంగ‌ళూరు, మంగ‌ళూరులోనూ ఆమె రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డులు పెట్టారు. ఇక హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై, మంగ‌ళూరులో ఆమెకు విలువైన ప్లాట్లు, ఖ‌రీదైన బంగ‌ళాలు ఉన్నాయి. వీటి విలువ మొత్తం లెక్కిస్తే ఆమె ఆస్తులు రు. 500 కోట్ల‌కు పైనే ఉంటుందంటారు.

Also Read : బ్రహ్మానందం ఆస్తి ఎన్ని కొట్లో తెలుసా ..

మలయాళంలో కి అనుష్క..

ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళ తర్వాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క. ‘కథానర్’ అనే సినిమాలో జయసూర్య, అనుష్క శెట్టి మెయిన్ లీడ్స్ లో నటించబోతున్నారు. ఇవాళే ఉదయమే అనుష్క ఆ సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో మూవీ యూనిట్ బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫొటోల్లో అనుష్క సన్నబడినట్టు కనిపిస్తుంది. గతంలో సైజు జీరో సినిమా కోసం బాగా లావు అయింది అనుష్క.

ఆ తర్వాత బాహుబలి సినిమా సమయంలో మళ్ళీ నాజూగ్గా తయారయింది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పుడు కొంచెం బొద్దుగా తయారయిందని కామెంట్స్ వచ్చాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కూడా అనుష్క కొంచెం బొద్దుగా ఉందని కామెంట్స్ చేశారు. ఇప్పుడేమో మళ్ళీ మొదట్లో ఉన్నట్టు సన్నగా మారిపోవడంతో అనుష్క కొత్త లుక్స్ వైరల్ అవుతున్నాయి.మరి అనుష్క మలయాళం మొదటి సినిమా ఎలా ఉంటుందో? తెలుగులో కూడా రిలీజ్ చేస్తారో చూడాలి.

నిజానికి ఆమె చేసిన సైజ్ జీర్ సినిమా వల్ల అనుష్క కెరీర్ కు బ్రేక్ పడింది. ఈసినిమా కోసం బాగా లావయ్యింది స్వీటి. ఆతరువాత బరువు తగ్గొచ్చులే అనుకుంది. కాని ఎంత ప్రయత్నం చేసినా.. ఏం చేసినా లావు తగ్గలేకపోయింది. ఇదే ఆమె కెరీర్ కు పెద్దమైనస్ లా మారింది. ఆతరువాత ఎన్ని ఆఫర్లు వచ్చినా.. సినిమాలు చేయలేకపోయింది అనుష్క. కొన్ని సినిమాల కోసం లావు తగ్గాలని ప్రయత్నించి విఫలం అయ్యింది. ఆమె అనుకుంటే చాలు కాని.. అనుష్క స్టార్ డమ్ ఇప్పటికీ అలానే ఉంది. రానా ,ప్రభాస్, గోపీచంద్ లాంటి సిక్స్ ఫీట్ హీరోలకు మంచి జోడీగా సరిపోతుంది అనుష్క.

దాదాపు 43 ఏళ్ల వయస్సు వచ్చినా.. గ్లామర్ విషయంలో మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు స్వీటి. కాని ఆమె కాస్త మనసు పెట్టి బరువు తగ్గితే మళ్లీ మంచి ఫామ్ లోకి రావడం పెద్ద విషయమేమి కాదు. త్రిష, నయనతార, దీపికాపదుకునే లాంటి తారలు 40 ఏళ్ళు దాటినా.. ఇంకా హీరోయిన్లు గా ఫామ్ ను కొనసాగిస్తుండటం తెలిసిందే. వారితో పోల్చుకుంటే అనుష్క స్టార్ డమ్ ఇంకాస్త పెద్దదే కాని తక్కువేమి కాదు. మరి స్టార్ హీరో కి ఉన్న రేంజ్ ఆమెకు ఉన్నప్పటికీ ఆమె ఎందుకు ఇలా సినిమాలను నెగ్లెట్ చేస్తుంది అనే విషయాల మీదనే సరైన అభిప్రాయం అయితే రావడం లేదు. నిజానికి అనుష్కలాంటి నటి చేత మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

Anushka Shetty
Anushka Shetty

18 ఏళ్లు పూర్తి 

2005లో తెలుగు చ‌ల‌న చిత్రం సూప‌ర్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు డైన‌మిక్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్. ఈ చిత్రంలో నాగార్జున న‌టించారు. ఎస్ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ విక్ర‌మార్కుడు మూవీలో న‌టించింది. ల‌క్ష్యం, శౌర్యం, చింత‌కాయ‌ల ర‌వి త‌దిత‌ర చిత్రాల‌న్నీ బాక్సాఫీసుల వ‌ద్ద దుమ్ము రేపాయి. ఉత్త‌మ న‌టి గా ఫిలిం ఫేర్ అవార్డు పొందింది.2010లో అనుష్క శెట్టి (Anushka Shetty) త‌మిళంలో న‌టించిన వేట్లై కార‌న్ , సింగం, సింగం-2 , యెన్నై అరిందాల్ యాక్ష‌న్ చిత్రాలు మంచి గుర్తింపు పొందాయి. భారీ స‌క్సెస్ సాధించాయి. వానం, దైవ తిరుమ‌గ‌ల్ , సైజ్ జీరో సినిమాల‌లో న‌టన‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి అనుష్క శెట్టికి.2015 లో రుద్ర‌మ‌దేవి చిత్రంలో న‌టించింది . ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది. ఉత్త‌మ న‌టిగా మూడో ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకుంది. ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బాహుబ‌లి, బాహుబ‌లి-2 లో దేవ‌సేన పాత్ర‌లో లీన‌మై న‌టించింది. ఈ రెండు చిత్రాలు అత్య‌ధిక వ‌సూళ్లు సాధించాయి.

🔴Related Post

Leave a Comment