Devi Sri Prasad | దేవిశ్రీ ప్రసాద్ మొత్తం ఆస్తులు ఎన్ని కొట్లో తెలుసా ..

Written by admin

Published on:

Devi Sri Prasad |రాక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దేవిశ్రీప్రసాద్ 1999లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవి’ సినిమాతో దేవిశ్రీ తన మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసారు. మొదటి సినిమాతోనే హిట్టుని అందుకున్న దేవిశ్రీ.. ఆ తరువాత ఆనందం, కలుసుకోవాలని, సొంతం వంటి మ్యూజికల్ మూవీస్ తో మ్యూజికల్ లవర్స్ ని మెస్మరైజ్ చేసారు.ఆ తరువాత ఖడ్గం, మన్మథుడు, వర్షం వంటి సినిమాలతో కమర్షియల్ హిట్స్ ని అందుకొని టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడ్డారు. ఇక అలా మొదలైన దేవిశ్రీ ప్రయాణం.. తమిళ, హిందీ భాషల్లో కూడా కొనసాగుతూ దేవిశ్రీని రాక్ స్టార్ ని చేసింది. దాదాపు తెలుగు, తమిళ్, హిందీ భాషలోని టాప్ హీరోల అందరికి దేవిశ్రీ సంగీతం అందించారు. ఇక తన రాకింగ్ మ్యూజిక్‌తో, ఎనర్జీతో హీరో స్థాయి ఇమేజ్ ని ఆడియన్స్ లో అందుకున్నారు.

పాన్ ఇండియా రేంజ్

Devi Sri Prasad

ప్రత్యేకించి థమన్ ఎంట్రీ తర్వాత దేవిశ్రీ చేస్తున్న సినిమాల సంఖ్య కూడా తగ్గింది. కానీ అల్లు అర్జున్‌ ‘పుష్ప’ మూవీ పాటలు పాన్ ఇండియా రేంజ్ వైరల్ కాగా.. తనలో సత్తా తగ్గలేదంటూ ట్రోలర్స్‌కు ఈ సినిమా మ్యూజిక్‌తో గట్టి సమాధానమిచ్చాడు దేవి. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రం కూడా మ్యూజికల్‌గా ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘పుష్ప2’తో పాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రానికి తనే మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే, ఒకప్పుడు తను త్రివిక్రమ్‌తో వరుస సినిమాలు చేయగా.. ఇప్పుడు మాత్రం గ్యాప్ వచ్చిందన్న రూమర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ ఎక్కువగా థమన్‌కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు.

దేవిశ్రీకి ఆ పేరు ఎలా..

దేవిశ్రీ ప్రసాద్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే విషయంలో చాలా మంది తన మొదటి సినిమా దేవి(1999) కారణంగా అతడికి ఆ పేరు వచ్చినట్లు అనుకుంటారు. కానీ అసలు కారణం అది కాదు. ఆయన అమ్మమ్మ, తాతాయ్యల పేర్లను కలిపి ఆయనకు దేవిశ్రీ ప్రసాద్ అని చిన్నతనంలోనే నామకరణం చేశారు. ఆయన పూర్తి పేరు గోర్తి దేవిశ్రీ ప్రసాద్.

దేవిశ్రీని టాలీవుడ్ డీఎస్‌పీ అని, రాక్ స్టార్ అని కూడా పిలుస్తారు.2000 నుంచి 2010 మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్‌గా డీఎస్పీ రికార్డు సృష్టించాడు. ఆ దశాబ్దంలో మొత్తం 50కి పైగా సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు.తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అగ్ర హీరోలందరికీ మ్యూజిక్ అందించిన రికార్డు డీఎస్పీకి ఉంది. ఇంకా వారి వారసుల సినిమాలకు దేవిశ్రీ మ్యూజిక్ అందించడం విశేషం.

Also Read : త్రిష పర్సనల్ లైఫ్ గురించి ఇది మీకు తెలుసా .. ​

దేవిశ్రీ తండ్రి సత్యమూర్తి గురించి

తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో 1953 మే 24న గొర్తి సత్యమూర్తి జన్మించారు. రామచంద్రపురంలో బీఎస్సీ పూర్తి చేసిన ఆయనకు సాహిత్యంపై మక్కువ ఎక్కువ. దీంతో ‘చైతన్యం’ అనే నవలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ‘పవిత్రులు’, ‘పునరంకితం’, ‘ఎదలోయలో నిదురించే’, ‘దిగంబర అంబరం’, ‘అధర గరళం’ వంటి ఎన్నో రచనలతో పాఠకులను ఆకట్టుకున్నారు. మొదట గేయ రచయిత కావాలనుకున్న ఆయన ‘దేవత’ సినిమాతో కథారచయితగా పరిచయమయ్యారు.

డి.రామానాయుడు నిర్మాతగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో సత్యమూర్తి పేరు మార్మోగిపోయింది.‘దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘చైతన్య’ సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. సుమారు 90కిపైగా సినిమాలకి కథా రచయితగా, 400కి పైగా సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు.మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌లో సత్యమూర్తి కీలక పాత్ర పోషించారు. వీరిద్దరి కలయికలో వచ్చిన అభిలాష, ఖైదీ నెం 786, ఛాలెంజ్, జ్వాల చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.అయితే చెన్నైలోని సాలి గ్రామంలో స్థిరపడిన ఆయన తన 62వ ఏట.. 2015, డిసెంబరు 14న చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

ఛార్మి ప్రేమలో దేవిశ్రీ..

తరచూ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) పెళ్లి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల పై ఈయన ఎప్పుడూ కూడా స్పందించిన దాఖలాలు లేవు. అయితే పెళ్లి వయసు దాటిపోయిన దేవి శ్రీ ప్రసాద్ ఇంకా సింగిల్ గా ఉండటానికి కారణం హీరోయిన్ ఛార్మి అని తెలుస్తుంది. ఒకానొక సమయంలో ఛార్మి దేవిశ్రీప్రసాద్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా వీరిద్దరూ కూడా పలు సందర్భాలలో జంటగా కనిపించడంతో ఈ వార్తలను నిజమేనని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. అయితే చార్మి మాత్రం దేవి శ్రీ ప్రసాద్ తో బ్రేకప్ చెప్పుకున్నారట. ఇలా వీరిద్దరికి బ్రేకప్ కావడంతో దేవిశ్రీ పెళ్లిపై ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఇలా ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత మరోసారి పెళ్లి గురించే దేవిశ్రీప్రసాద్ ఆలోచించలేదని అందుకే ఈయన ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారని తెలుస్తుంది.

మంగ్లీ చెల్లెలితో పెళ్లి

అయితే గ‌త కొద్ది రోజులుగా దేవి శ్రీ పెళ్లి గురించి నెట్టింట అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఫలానా హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోష‌ల్ మీడియాలో తెగ వార్త‌లు వ‌చ్చాయి. వాటిపై దేవి శ్రీ స్పందించ‌క‌పోవ‌డంతో అవి పుకార్లుగానే మిగిలిపోయాయి.ఇక తాజాగా దేవి శ్రీ ప్ర‌సాద్ పెళ్లికి సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌ని ఊపేస్తున్న‌ మంగ్లీ గురించి మనంద‌రికి తెలిసిందే.

ఆమె సోదరి ఇంద్రావతి పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ పాడి ఫుల్ క్రేజ్ ద‌క్కించుకుంది.ఈ అవకాశం ఆమెకి ఇచ్చింది దేవి శ్రీ ప్రసాద్ కావ‌డం విశేషం దేవి శ్రీ ప్ర‌సాద్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇంద్రావ‌తి ఆయ‌న‌కి విషెస్ తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన్ని పిక్స్ షేర్ చేయ‌డంతో నెటిజన్స్ వారిద్ద‌రికి లింక్ పెట్టారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంద‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు, తమిళం, హిందీ చిత్రాలు కలిపి మొత్తం 100కి పైగా సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. సంగీత దర్శకుడిగానే కాకుండా.. గాయకుడిగానూ 60 పాటలు పాడరు. 20 పాటలకు సాహిత్యాన్ని సమకూర్చారు.దేవిశ్రీ ప్రసాద్ ఖాతాలో మొత్తం 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 5 సైమా అవార్డులు, ఓ నంది పురస్కారం ఉన్నాయి. కెరీర్‌లో బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తూ.. ఏడాది మొత్తం ప్రేక్షకులు ఆయనే పాటలే వినేలా సంగీతాన్ని అందించారు. కుమారి 21 ఎఫ్ చిత్రంలో బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్ అనే పాటకు కొరియోగ్రాఫర్‌గానూ పనిచేశారు. సంగీతంతో పాటు పాటను ఆలపించి, కొరియోగ్రాఫర్‌గానూ పనిచేయడం ఇదే తొలిసారి.

Devi Sri Prasad

తమ్ముడు సాగర్‌

దేవిశ్రీ ప్రసాద్‌ తమ్ముడిగా సాగర్‌ ఇండస్ట్రీకి సుపరిచితమే. అయితే అతడు సింగర్‌ అనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అన్న సంగీత దర్శకత్వంలోనే ఎన్నో పాటలు పాడి గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.అంతేకాదు గతంలో ఓ సింగింగ్‌ షోకు కూడా యాంకర్‌గా వ్యవహరించాడు సాగర్‌. ఈ క్రమంలో 2019లో డాక్టర్‌ మౌనికను పెళ్లాడాడు.

అయితే గతంలో సాగర్‌-మౌనిక దంపతులకు ఇది రెండో సంతానం. మొదట వారికి కుమారుడు జన్మించాడు. అతడి పేరు వివాన్‌ దక్ష్‌. గతేడాది సెప్టెంబర్‌ 18న వివాన్‌ ఫస్ట్‌ బర్త్‌డే జరిగింది.తాజాగా తమ్ముడు సాగర్‌ మరోసారి తండ్రి అవ్వడవంతో రాక్‌స్టార్‌ ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. కాగా దేవిశ్రీ ప్రసాద్‌ నాలుగు పదుల వయసులోనూ మోస్ట్‌ బ్యాచీలర్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు.

దేవి శ్రీ.. 21 సంవత్సరాల కాలంలో 100 చిత్రాలకు పైగా పనిచేశారు.ఈ క్ర‌మంలోనే భారీగా ఆస్తుల‌ను కూడా కూడ‌బెట్టాడు. ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. దేవి శ్రీ ప్ర‌సాద్ ఆస్తుల విలువ అక్ష‌రాల రూ. 50 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు దేవి శ్రీ ప్ర‌సాద్ రూ. 3 నుంచి 4 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నాడు. ఆస్తుల ప‌రంగా.. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు దేవి శ్రీ ముందు దిగ‌దుడుపే అని చెప్పాలి.అంతేకాదు దేవి కి ఓ ఖరీదైన ఇల్లుతో పాటు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట.

Devi Sri Prasad

మోదీతో దేవీ శ్రీ..

ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ది రూల్‌తోపాటు పలు ప్రధాన భాషల లీడింగ్‌ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ కంపోజర్ ప్రధాని నరేంద్రమోదీ తో ప్రత్యక్షమైన స్టిల్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఇంతకీ డీఎస్పీ, మోదీని ఎక్కడ కలిశారనే కదా మీ డౌటు. న్యూయార్క్‌లో జరిగిన ఓ కల్చరల్‌ ఈవెంట్‌ కు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే ఈవెంట్‌లో ఈ ఇద్దరు ఇలా ఒక్కచోట కలిసిపోయారు.

ఈవెంట్‌లో పర్‌ఫార్మెన్స్‌ అయిన తర్వాత స్టేజ్‌పైకి వచ్చిన మోదీ డీఎస్పీని ఆత్మీయంగా హగ్ చేసుకుని.. అభినందనలు తెలియజేశారు.ఇక ఇది ఇలా ఉంటే, దేవిశ్రీ ఈ స్పెషల్ డేని మరింత స్పెషల్ గా చేసుకున్నట్లు తెలుస్తుంది. మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజాని గురువుగా భావించే దేవిశ్రీ.. ఆయన స్ఫూర్తితోనే ఇంత గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగాను అని చెప్పుకొస్తుంటారు. అందుకనే తన స్టూడియోలో ఇళయరాజా భారీ ఫోటోని పెట్టుకొని రోజు ఆరాధిస్తుంటారు. జీవితంలో ఎప్పుడైనా ఇళయరాజా తన స్టూడియోకి వస్తే.. ఆ పిక్చర్ ముందు ఫోటో దిగాలని కలగంటఆ కల ఇన్నాళ్ల తరువాత నిజమైంది. రీసెంట్ గా దేవిశ్రీ స్టూడియోని ఇళయరాజా సందర్శించారు.

పుష్ప: ది రైజ్‌’, ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలకు పనిచేసినట్లే ‘పుష్ప 3’కి కూడా చేస్తామని చెప్పారు దేవిశ్రీ ప్రసాద్‌. ‘పుష్ప 2’ కోసం చేసిన కొన్ని ట్యూన్స్‌ ఉండిపోయాయని, వాటిని ‘పుష్ప 3’లో వాడే అవకాశం ఉందని చెప్పాయాన. సుకుమార్‌.. రామ్‌ చరణ్‌తో ఓ సినిమా ప్రకటించారు. అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఇవి పూర్తయ్యాక ‘పుష్ప 3’ని పట్టాలెక్కిస్తారని సమాచారం.అయితే.. అది అంత ఈజీ కాదు అని అంటున్నారు. ప్రజలు ‘పుష్ప’రాజ్‌ కోసం అన్ని రోజులు వెయిట్‌ చేస్తారా?వచ్చినా కనెక్ట్‌ అవుతారా అనేది చూడాలి.ఇదిలా ఉంటే, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్‌లో కాస్త తగ్గిందనే చెప్పాలి.

🔴Related Post

Leave a Comment