child artist | జయం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పెద్ద స్టార్..?

జయం మూవీ

child artist | ఇప్పటికి కూడా జయం సినిమా పాటలు వినిపిస్తూనే ఉన్నాయి కారణం అప్పట్లో అదో గొప్ప విజయం కానీ ఆరోజుల్లో తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూత్ కు బాగా దగ్గరయ్యాయి. తేజ ఎన్నో ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్‌లో జయం సినిమా ఒకటి. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను అంత సులభంగా మరిచిపోలేరు. ఒకప్పుడు ఓ ఊపు ఊపేసింది ఈ మూవీ. జయం ఒక బ్రాండ అనే చెప్పాలి. నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా నటించారు ఈ సినిమాలో. అలాగే యాక్షన్ హీరో గోపీచంద్ విలన్ గా నటించి మెప్పించారు. ఈ సినిమాతో అందరికి మంచి గుర్తింపు వచ్చింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

 child artist
child artist

అలాగే ఆర్ఫీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో గోపిచంద్ విలన్ పాత్రలో అదరగొట్టేశారు. జయం చిత్రంలో నితిన్, సదా, గోపిచంద్ ముగ్గురి నటనపై ప్రశంసలు వచ్చాయి.విలన్ పాత్రలో గోపిచంద్ తనదైన నటనతో మెప్పించగా.. ఈ సినిమాలో చైల్డ్ ట్రాక్ కూడా ఉందన్న సంగతి తెలిసిందే. చిన్నప్పుడే రఘు, సుజాతల స్నేహం, గొడవ గురించి సినిమా మొదట్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. ఇందులో రఘు (గోపిచంద్) చిన్నప్పటి నుంచి నెగిటివ్ షేడ్స్ ఉన్న కుర్రాడు. గోపిచంద్ చిన్నప్పటి పాత్రలో కనిపించి మెప్పించిన కుర్రాడు దిలీప్ కుమార్ సాల్వాది. 1990లో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేశాడు. కృష్ణ నంబర్ 1 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దిలీప్.. దాదాపు 20 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు.

హీరో నిఖిల్

పుణ్యభూమి నా దేశం, మౌనం, ధర్మచక్రం, స్నేహం కోసం, అనగనగా ఓ అమ్మాయి, అన్నయ్య, మా అన్నయ్య, డాడి, జయం, భాగ్మతి వంటి చిత్రాల్లో నటించాడు.2005 తర్వాత పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించాడు. 2019లో వచ్చిన దిక్సూచీ సినిమాతో హీరోగా మారాడు. దొంగల బండి, షీ వెబ్ సిరీస్ సీజన్ 2 లో నటించాడు. కానీ దిలీప్ కుమార్ సాల్వదికి హీరోగా అంతగా గుర్తింపు రాలేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.మరో పక్క గోపీచంద్ చిన్ననాటి పాత్ర పోషించిన అబ్బాయి గురించి అందరూ సోషల్ మీడియాలో హీరో నిఖిల్ అని అనుకుంటున్నారు.కానీ హీరో నిఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ చిత్రంలో నటించలేదు.చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా ప్రయత్నాలు చేసి కనుమరుగైపోతున్న వారే అందులో దిలీప్ కుమార్ సలవాడి కూడా ఒకరు.

Also Read : పది ట్రాక్టర్లు ఉచితంగా పంచిన రాఘవ లారెన్స్.. నిజంగా గ్రేట్

ఎంతో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ నటుడుగా మాత్రం సక్సెస్ అవ్వలేకపోయాడు.ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకపోతే ఏమీ సాధించలేము అని చెప్పడానికి దిలీప్ కుమార్ కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ప్రస్తుతం దిలీప్ కుమార్ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ తన పని చేసుకుంటూ పోతున్నాడు.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా.? జయం సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించిన అమ్మాయి సినిమాలో మంచి పాత్రను పోషించిది. అక్షరాలను రివర్స్ లో రాయడం చాలా ఆసక్తి కలిగిచింది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

యామిని

 child artist
child artist

ఆ చిన్నదాని పేరు యామిని శ్వేతా నాయుడు. జయం సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత సినిమాల్లోకి పెద్దగా నటించలేదు ఈ చిన్నది. జయం సినిమా తర్వాత చదువు పై దృష్టి పెట్టింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఈ అమ్మడు పెళ్లి కూడా చేసుకుంది. సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Leave a Comment