దేవర
భారీ వసూళ్ల
Jr NTR | ఎన్టీఆర్ నటించిన దేవర
మూవీ సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయం సాధించింది. నెగటివ్ టాక్ వచ్చినా మూవీ మంచి కలెక్షన్లని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది సుమారు ఐదు వందల కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. మాస్ ఎలిమెంట్లు, యాక్షన్ సీన్లు, సెంటిమెంట్ సినిమాని బతికించాయి. నార్త్ ఆడియెన్స్ కి అవి బాగా కానెక్ట్ కావడంతో దేవర
భారీ వసూళ్లని రాబట్టింది. అయితే దేవర
లో దేవర పెద్ద ఎన్టీఆర్ చనిపోయినట్టు చూపిస్తారు. కొడుకే చంపినట్టు చూపిస్తారు. అదే సమయంలో వర కూడా చనిపోయినట్టుగా చూపిస్తారు. యతి ఎవరు? అనేది చూపించలేదు, హై ఇచ్చి వదిలేశారు. తాజాగా దేవర 2
కథ ఇదే అని ఓ రైటర్ రివీల్ చేశాడు. గూస్‌బంమ్స్ తెప్పించే విషయాలను పంచుకున్నారు.
నిజానికి తండ్రి ఎన్టీఆర్ దేవర చనిపోలేదట. ఆయన సముద్రంలోనే ఉన్నాడట. కత్తిపోటుతో ఉన్న దేవరని కోస్టల్ గార్డ్ కాపాడతాడట. ఈ క్రమంలో ఫైట్ చేసింది కూడా కోస్టల్ గార్డే అని, ఎక్స్ రూపంలో కట్ చేసింది కూడా వాళ్లే అని అంటున్నారు.సముద్రంలో ఫైట్ చేసింది కూడా పిల్లవాడు కాదు, దేవరనే అని, పార్ట్ 2లో దాన్ని చూపిస్తారట. రెండో పార్ట్ లో కథ కోస్టల్‌లో కాదు, సిటీలో జరుగుతుంది. ఆయుధాలు వ్యాపారం ఎక్కడెక్కడ జరుగుతుంది? దీని వెనకాలు ఎవరెవరు ఉన్నారనేది దేవర ఛేదించుకుంటూ వస్తాడట. దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

క్యారెక్టర్ ఆర్టిస్ట్
తండ్రి, కొడుకుల పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దేవర, వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రలకు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ‘వర’కు జంటగా జాన్వీ కపూర్ ఉండగా ‘దేవర’కు జంటగా శృతి మరాఠి నటించింది.శృతి మరాఠీ గుజరాత్ కి చెందిన అమ్మాయి. మరాఠీ, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. గతంలో తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. శృతి మరాఠి కొన్ని హిందీ సీరియల్స్ లో కూడా కనిపించింది.
ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్ లలో కూడా ఛాన్సులు తెచ్చుకుంటుంది. ఈమె గౌరవ్ ఘటనేకర్ అనే నటుడిని 2016 లో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది శృతి మరాఠి. దేవర సినిమాలో ఎన్టీఆర్ చేసే తండ్రి పాత్రకు భార్యగా నటించింది. దీంతో రెండు లుక్స్ లో కనిపించింది. యంగ్ పాత్రలో, ముసలి పాత్రలో శృతి మరాఠీ దేవరలో కనిపించింది.అంటే ఒక ఎన్టీఆర్ కి భార్యగా, ఇంకో ఎన్టీఆర్ కి తల్లిగా కనిపించబోతుంది.
Also Read : వడ్డే నవీన్ భార్య కి నందమూరి కుటుంబానికి ఉన్న బంధం ఇదే .
దేవర-2కు ముహూర్తం
‘దేవర’ రిలీజ్ ముందు వరకు ‘దేవర-2’ ఎప్పుడు చేయాలనే విషయంలో టీంకు కూడా స్పష్టత లేదు. రిజల్ట్‌ను బట్టి, ఎన్టీఆర్ కమిట్మెంట్లను బట్టి నిర్ణయం తీసుకోవాలనుకున్నారు.ఇప్పుడు సినిమా ఫలితం తేలిపోయిన నేపథ్యంలో ‘దేవర-2’ను ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లొచ్చట.
ఆ తర్వాత ఇంకో ఏడాదికి.. బహుశా దసరా లేదా క్రిస్మస్ టైంకి సినిమాను విడుదలకు సిద్ధం చేయాలని అనుకుంటున్నారట. రెండో భాగానికి టెక్నికల్ టీంలో కొన్ని మార్పులు ఉండొచ్చని సమాచారం.అప్పటి వీలును బట్టి టెక్నీషియన్లను ఎంచుకుంటారట. ప్రస్తుతం తారక్ చేతిలో వార్-2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. ఇవి రెండూ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం పట్టొచ్చు. అవి పూర్తయ్యే సమయానికి కొరటాల వీలైతే వేరే సినిమా చేసి ఆ తర్వాత దేవర-2ను మొదలుపెట్టొచ్చు. లేదా అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు.
తమిళంలో డిజాస్టర్
తమిళంలో మాత్రం నిరాశపరిచింది. దీంతో తమిళనాడులోని ప్రేక్షకులు ఇతర భాషా హీరోల చిత్రాలను ఎక్కువగా ప్రోత్సహించరని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవర కేవలం 8 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని తమిళ విశ్లేషకులు తెలిపారు. ఓవర్సీస్‌లో కూడా దేవర తమిళ వెర్షన్ ద్వారా 15 వేల డాలర్లనే మాత్రమే వసూలు చేయగలిగింది. ఎన్టీఆర్ చాలా కష్టపడి ఐదు భాషల్లో తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇప్పటికీ తమిళ ప్రేక్షకులు ఎప్పటిలాగానే తెలుగు హీరోల సినిమాలకి ఆసక్తి చూపించలేదు. అందుకే ఇక నుంచి మన దర్శకనిర్మాతలు దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేయడం కంటే తెలుగు, హిందీ వెర్షన్లపై దృష్టి సారిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
1000 కోట్ల వసూళ్లు ఇప్పుడు ఎలా అయ్యాయంటే, ఒకప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ కోసం పోటీ పడ్డ హీరోల్లా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు 1000 కోట్ల నెంబర్ గేమ్ ఆడుతున్నారు. ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన మూవీ పాన్ ఇండియా లెవల్లో హిట్టైనా 670 కోట్లే వచ్చాయి. అందుకే వెయ్యికోట్ల క్లబ్ లో సినిమా చేరితే, దర్శకుడిగా రాజమౌళి, సుకుమార్ తర్వాత తన పేరు కూడా పాన్ ఇండియా లెవల్లో మారుమోగాలనుకుంటున్నాడు కొరటాల శివ.కాబట్టే దేవర2 కోసం కొత్త మార్పులు షురూచేశాడు. ఆల్రెడీ బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ ని ఈ సినిమాలో స్పెషల్ రోల్ కోసం తీసుకుంటున్నాడు. తన కోసం కథలో చాలా మార్పులుచేశాడు.

కట్ చేస్తే ఇప్పుడు కాంతారా ఎఫెక్ట్ నుంచి దేవర కూడా తప్పించుకునేలా లేదని తేలుస్తున్నాడు. నిజానికి కాంతారా ఎఫెక్ట్ నుంచి పుష్పరాజ్ కూడా తప్పించుకోలేదు. పుష్ప ఎంత హిట్ అయినా, పుష్ప2 లో మాత్రం కాంతారా సీన్ ని రెండు సార్లు వాడాల్సి వచ్చిందిగంగమ్మ జాతర సీన్, క్లైమాక్స్ లో మల్లీ అలాంటి సీన్ లోనే యాక్షన్ ఎపిసోడ్ పెట్టారు. ఎంతగా అంతా కాంతారా సీన్ కాపీ అంటూ కామెంట్స్ చేసినా వసూళ్లొచ్చాయి.. పుష్ప 2 యాక్షన్ ఎపిసోడ్ లు భారీగా పేలాయి. కాబట్టే, ఎవరు ఔనన్నా కాదన్నా,కొన్ని సార్లు ఆడియన్స్ కోసం కొన్ని సీన్స్ చేయక తప్పదు. నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి సినిమా నచ్చాలంటే, భక్తి తో పాటు ఇలాంటి సాహసం ఏదోచేయక తప్పదు.
Also Read : అనుష్క ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అతనేనా..?
దేవర’తర్వాత ఎన్టీఆర్ స్క్రీన్ పై కనపడే మూవీ ‘వార్ 2 ‘ 2019 లో హిందీ ప్రేక్షకులని అలరించిన వార్ 1 కి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కనుండగా,’హృతిక్ రోషన్'(Hrithik ROshan)తో కలిసి ఎన్టీఆర్(Ntr)స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.ఇండియన్ చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్న అతిపెద్ద మల్టి స్టారర్ గా కూడా క్రేజ్ ని సంపాదించిన ‘వార్ 2′(War 2)పై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.
కొన్ని రోజుల క్రితం అధికారకంగా ప్రారంభమైన ఈ మూవీ ప్రస్తుతం షూట్ లో ఉందనే ప్రచారం జరుగుతుంది.ఎన్టీఆర్ పోర్షన్ తప్ప మిగతా నటీనటులతో సీన్స్ ని చిత్రీకరిస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్.ఇక ఈ మూవీలో మలయాళ స్టార్ యాక్టర్ ‘టోవినో థామస్'(Tovino Thomas) నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.ఇందుకు బలాన్ని చేకూర్చేలా రీసెంట్ గా ప్రశాంత్ నీల్,టోవినో థామస్ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
సాధారణంగా ఫిఫా వరల్డ్ కప్ చేసే పోస్టులపై ఫుట్‌బాల్ అభిమానులు మాత్రమే రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఈ పోస్ట్ కింద అందరూ ఎన్టీఆర్ అభిమానులే కామెంట్లు చేస్తూ, లైక్ చేస్తుండడం విశేషం.. మిక్స్‌డ్ టాక్‌తో రిలీజ్ అయిన ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం అందుకుంది. నెగిటివిటీని దాటుకుని అన్ని ఏరియాల్లో లాభాలు తెచ్చిపెట్టింది. ఈ మూవీ సక్సెస్‌తో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, అభిమానులను సంపాదించుకోవడం వల్లే ‘NTR’ పేరుతో ఫిఫా వరల్డ్ కప్ ఇలా పోస్ట్ చేసిందని ఆనందంతో పొంగిపోతున్నారు… ‘దేవర’ ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. చాలా దేశాల్లో ఇప్పటికీ టాప్ 10లో ట్రెండ్ అవుతున్న ‘దేవర’ మూవీ, ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఫ్యాన్స్ డిమాండ్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చం తాత పోలికలతో ఉన్న ఈ నందమూరి వారసుడికి, ఫ్యాన్ బేస్ ఎంతో ఉంది. మరొకవైపు ఎన్టీఆర్ కూడా తన అభిమానులను ప్రాణం పెట్టి చూసుకుంటారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల కోసం ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందులో భాగంగానే అభిమానులకు, ఏపీ ప్రజలకు దగ్గరయ్యేలా తన భార్య లక్ష్మీ ప్రణతిని బిజినెస్ రంగంలోకి దింపబోతున్నారట.ఇదే సమయంలో అటు ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని టీడీపీ పార్టీని ఆదుకునేది ఆయన మాత్రమే అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.
Also Read : నాకు ఆరుగురు భర్తలు .. నటి అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్ ,
అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ విజయకేతనం ఎగరేసి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. అయినప్పటికీ కూడా నందమూరి అభిమానుల కన్ను ఎన్టీఆర్ పైనే ఉంది. ఆయనే రాష్ట్రానికి సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. అందుకే ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఈ పరిస్థితుల్లో తన భార్యతో కలిసి ఎన్టీఆర్ ఒక మాస్టర్ ప్లాన్ చేశారని సమాచారం.తన భార్య లక్ష్మీ ప్రణతిని రంగంలోకి దించుతూ.. కొత్త బిజినెస్ ప్లాన్ చేశారట.
ఈ బిజినెస్ ఏపీ ప్రజలకు అవసరాలు తీర్చడమే కాకుండా తనను ప్రజలతో మమేకం చేస్తూ తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉందనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఆ బిజినెస్ ఏంటనే విషయం ఇంకా పూర్తి క్లారిటీగా తెలియాల్సి ఉంది.ఇకపోతే తనపై అభిమానులు ఇంత ప్రేమను చూపిస్తున్న నేపథ్యంలో హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే వారిని కలుసుకోవడం కోసం ఒక మీటింగ్ కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సమావేశం నిర్వహించడానికి సమయం పడుతుంది కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలని కూడా కోరారు ఎన్టీఆర్.