సోదరి జ్యోతిక.
Nagarjuna | ఒకప్పుడు టాలీవుడ్ ను తన అందచందాలతో ఊపేసిన అరేబియన్ గుర్రం లాంటి హీరోయిన్ నగ్మా. ఆమె తెలుగులో అందరు స్టార్ హీరోలతో నటించింది. ఆమె సోదరి జ్యోతిక.. జ్యోతిక తెలుగులో నాగార్జునతో మాస్ – రవితేజతో షాక్ – చిరంజీవితో ఠాగూర్ సినిమాలు చేసింది. టాలీవుడ్ లో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా డబ్బింగ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో ఆమె నటించిన చంద్రముఖి సినిమా ఆమె క్రేజ్‌ను సౌత్ లో రెట్టింపు చేసింది. అయితే జ్యోతిక లారెన్స్ దర్శకత్వంలో నాగార్జునకు జోడిగా మాస్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో నటించేందుకు లారెన్స్ – నాగార్జున జ్యోతికను అప్రోచ్ అయ్యారట.నాగార్జున సినిమా కదా అని వెంటనే ఓకే చెప్పలేదట. కొన్ని కండిషన్లు కూడా జ్యోతిక పెట్టిందట.

దీనికి ప్రధాన కారణం ఏంటంటే ? అప్పటికే ఆమె కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ప్రేమలో ఉంది.. 2006లో సూర్య జ్యోతిక పెళ్లి చేసుకున్నారు. 2004లో మాస్ సినిమా చేసింది.. ఈ సినిమాలో చేసేందుకు జ్యోతిక షూటింగ్ కోసం తప్ప ఇతర విషయాల్లో పెద్దగా ఇబ్బంది పెట్టవద్దని … ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేయనని .. ఎలాంటి రొమాంటిక్ సీన్లు లేకుండా చూడాలని చెప్పిందట. ఈ కండిషన్ కి ఓకే అయితేనే ఆ ప్రాజెక్టుకి సైన్ చేస్తానని పైగా సూర్యతోనే చెప్పించిందట. ఆ కండిషన్లకు ఓకే అనుకున్నకే మాస్ సినిమాలో జ్యోతిక హీరోయిన్గా ఫైనల్ చేశారు.అయితే జ్యోతిక తమిళంలో చేసిన మొదటి సినిమాను సూర్యతో కలిసి చేసింది.
Also Read : బాక్స్ ఆఫీస్ లో దుమ్ములేపిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
కండీషన్లు హీరోయిన్
ఆ సినిమా తర్వాత తనకు వరుస ఆఫర్లు రావడంతో కోలీవుడ్ లోనే సెటిలైపోయింది జ్యోతిక. హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుని మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్న జ్యోతిక తర్వాత మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. కోలీవుడ్ లో సెటిల్ అయ్యాక బాలీవుడ్ వైపు చూడటమే మానేసింది జ్యోతిక.కానీ గతేడాది మళ్లీ మాధవన్ తో కలిసి సైతాన్ సినిమాతో బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ఆ మూవీతో మంచి హిట్ అందుకుంది. పాతికేళ్ల తర్వాత హిందీలో చేసిన సైతాన్ తర్వాత జ్యోతిక కు బాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది జ్యోతిక.సౌత్ లో ఎవరైనా కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేయడంటే అది చాలా పెద్ద ఛాలెంజేనని,

ఒంటరిగా పోరాటం
అప్పట్లో బాలచందర్ లాంటి డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసేవాళ్లు. కానీ ఈ రోజుల్లో అలా ఎవరూ తీయట్లేదని, స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తున్నారని, సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రావడం పూర్తిగా తగ్గిపోయిందని, దానికి బడ్జెట్ తో పాటూ మహిళల వయసు కూడా ఓ కారణమని తెలిపారు.అంతేకాదు, సౌత్ లో మహిళల కోసం మంచి కథలు రాసే రైటర్లు సైతం తగ్గిపోయారని, అందుకే దక్షిణాదిలో నటిగా ఎదగడమంటే ఒంటరిగా పోరాటం చేయడమేనని ఆమె తెలిపారు. సౌత్ లో పలు సినిమాల్లో నటించి చాలా కాలం పాటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జ్యోతిక ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీపై ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Also Read : ఇలియానా జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా ..
పెద్ద వ్యక్తుల కోసం సినిమాలు తీసే పెద్ద వ్యక్తులు మాత్రమే మనకు ఉన్నారు. ఒక నటి కోసం సినిమా తీసే పెద్ద ఫిలింమేకర్స్ మనకు లేరని భావిస్తున్నట్టు చెప్పారు. మహిళా నటీమణులకు బడ్జెట్ పరిమితం. వయస్సు పెద్ద సవాల్. రెండవది ఒక మహిళా దృక్కోణం నుండి అనుభవజ్ఞులైన దర్శకుడు కథ చెప్పడం. దక్షిణాదిలో ఒక మహిళ ప్రయాణం చాలా కఠినమైనదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ఒంటరి పోరాటం! అని కూడా జ్యోతిక అన్నారు.కెరీర్ మ్యాటర్ కి వస్తే..

జ్యోతిక త్వరలో ‘డబ్బా కార్టెల్’ అనే చిత్రంలో కనిపిస్తుంది. ‘డబ్బా కార్టెల్’ ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది. ఐదుగురు మధ్యతరగతి మహిళల లంచ్ బాక్స్ వ్యాపారం ఊహించని విధంగా వారిని ప్రమాదకరమైన డ్ర\ కార్టెల్‌లోకి తీసుకెళ్తుంది. ఒక చిన్న వ్యాపారంలా ప్రారంభమైనా, ఇది ఫార్మా మాఫియా గురించి, ఈ రంగంలోని చీకటి వ్యాపారాల గురించి అన్వేషిస్తుంది. ఈ చిత్రానికి హితేష్ భాటియా దర్శకత్వం వహించారు. షబానా అజ్మీ, గజరాజ్ రావు, జ్యోతిక తదితరులు ఇందులో నటించారు.