Inter Results | గ్రేట్.. చిన్నప్పుడే బాల్య వివాహం.. కానీ ఎదిరించి మరి ఇంటర్ లో 978 మార్కులు..

Inter Results | ఈ ఏడాది మార్చి 5 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు జరిగాయి. 25వ తేదీ వరకూ జరిగిన ఈ పరీక్షలకు రెండు సంవత్సరాలు కలిపి దాదాపు 9.5లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మెుత్తం 60 లక్షల పరీక్షా పత్రాలకు మూల్యాంకనం చేయాల్సి రాగా.. దానిని 19 కేంద్రాల్లో నిర్వహించారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే మూల్యంకనం ప్రక్రియ ముగియగా… మార్కుల కంప్యూటీకరణ కోసం ఇంతకాలం పట్టింది.పరీక్షలకు హాజరైన ఇంటర్ విద్యార్థులు తమ రిజల్ట్స్ ను tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ లో తెలుసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ ను వెబ్ సైట్ లో నమోదు చేసి సబ్ మిట్ చేయడం ద్వారా మీ పరీక్షలకు సంబంధించిన మార్కుల వివరాలను పొందవచ్చు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు తర్వాతి తరగతికి ఉత్తీర్ణత సాధిస్తారు. పొరపాటున ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఫీజు చెల్లించి తిరిగి పాస్ అయ్యే అవకాశాన్ని ఇంటర్ బోర్డ్ కల్పించింది.అది పక్కన పెడితే కాలం ఎంత మారుతున్నా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లీదండ్రులు ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.బాలికల విద్యకు తోడ్పాటు అందిస్తే ఉన్నత స్థాయిలో రాణిస్తారని బానోతు కుసుమ కుమారి( Banothu kusuma kumari ) సక్సెస్ స్టోరీతో ప్రూవ్ అయింది.ఇంటర్( Telangana Inter Results) లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన ఈమె సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem )లోని మారుమూల గ్రామంలో జన్మించిన కుసుమ ఆడపిల్లలంటే చిన్నచూపుగా భావించే ప్రాంతంలో పెరిగారు.తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో పరిస్థితులు అర్థమైన తర్వాత సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలని కుసుమ భావించారు.కష్టపడి చదివి కుసుమ మంచి మార్కులు సాధించినా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

14 సంవత్సరాలకే నాకు పెళ్లి చేయడానికి ఇంట్లో వాళ్లు ప్రయత్నించారని నా మనస్సు మాత్రం అందుకు అంగీకరించలేదని ఆమె తెలిపారు.ఎలాగైనా ఆ గండం నుంచి బయటపడాలని చైల్డ్ లైన్ కు ఫిర్యాదు చేశానని కుసుమ పేర్కొన్నారు.సమాచారం తెలుసుకున్న అధికారులు కుసుమ తల్లీదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పెళ్లిని ఆపేయడం జరిగింది.నేను బాగా చదువుకుని నర్సుని అవ్వాలని అనుకుంటున్నానని అధికారులకు చెప్పగా మణుగూరులోని చిల్డ్రన్స్ హోమ్ కు పంపించారని ఆమె పేర్కొన్నారు.ఆ తర్వాత నన్ను కేబీవీపీలో చేర్పించారని కుసుమ చెప్పుకొచ్చారు.ఇంటర్ లో 978 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచానని ఆమె అన్నారు.కుసుమ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Also Read : ముఖం మీదే ఉమ్మేసారు.. సింగర్ కల్పన జీవితంలో అంతా విషాదం..

Leave a Comment