Nayanthara | హీరోయిన్ నయనతార విభిన్నమైన సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో అనేక హిట్స్ అందుకున్న నయన్… కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. షారుఖ్ ఖాన్ సరసన జవాన్ మూవీతో అక్కడ సైతం భారీ విజయాన్ని అందుకుంది. మొదట నయనతార తెలుగు చిత్ర పరిశ్రమలో మలయాళ సినిమాతో వెండితెరపై మెరిసినా రజినీకాంత్ తో నటించిన చంద్రముఖి సినిమా రిలీజ్ అయ్యే వరకూ తెలుగు ఆమె ఎవరో కూడా తెలియదు.
వాయిదా వేసుకునే పరిస్థితి
ఆమె తన మొదటి సినిమాలో డీసెంట్ గా కనిపించిన నయనతర గజినీ సినిమాలో గ్లామర్ పాత్రలో కనిపించి అందరికీ షాక్ కి గురి చేసింది.అంతేకాదు.. నెమ్మదిగా తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లిన నయనతార, తెలుగు తమిళ మలయాళ భాషల్లో అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక మార్కెట్ వచ్చింది అనుకున్న తర్వాత నయన్, సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తూ క్రేజ్ ని సంపాదించుకుంది.అయితే ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించిన మలయాళీ అమ్మాయి ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా టాప్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు.. దాదాపు ఆరేడేళ్లుగా అదే పొజిషన్ లో ఉన్న నయనతార సినిమా రిలీజ్ అవుతుంది అంటే టాప్ హీరోలు కూడా వాళ్ల సినిమాలని వాయిదా వేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ భామ.

మొదట శింబుతో మన్మథ సినిమా టైంలో ఘాటుగా లవ్ స్టోరీని నడిపింది. వీళ్లిద్దరికీ సంబంధించిన చాలా ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. కానీ ఆ తర్వాత ఇద్దరూ బ్రేకప్ అయిపోయారు. ఈ బ్రేకప్ ఎఫెక్ట్, చాలా కాలం వరకూ నయనను వేధించింది. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం మొదలైంది. ఇద్దరూ దాదాపు పెళ్లి పీటల వరకూ వచ్చేసిన టైం కి, ఆ రిలేషన్ కూడా బాల్చీ తన్నేసింది. నిజానికి అప్పటికి శ్రీరామరాజ్యం చేస్తున్న నయన, ఇక ఆ సినిమాతో కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి, ప్రభుదేవాతో సెటిల్ అయిపోదామని కూడా అనుకుంది. కానీ అవేమీ జరగలేదు. ఇక ముచ్చటగా మూడో కథ, నేనూ రౌడీనే సినిమా దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో జరిపింది.
నిజానికి ఇది మొదట పుకారే అని అందరూ అనుకున్నా, అతన్ని హగ్ చేసుకుని ఉన్న ఫోటోను నయన తన వాట్సాప్ ఫ్రొఫైల్ పిక్ గా పెట్టడంతో, విషయం అందరికీ తెలిసింది. అయితే నయన్ కి విగ్నేష్ కు ఏజ్ గ్యాప్ ఉండనే సంగతి బహుశా చాలా మందికి తెలిసుండదు. అయితే విగ్నేష్ పెద్దవాడు అని కాదు.నయన్ కన్నా విఘ్నేష్ 10 నెలలు చిన్నవాడట.ఈ విషయాన్ని దర్శకుడు విఘ్నేష్ కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ‘నా కంటే నయనతార 10 నెలలు పెద్దదని’ చెప్పుకొచ్చాడు.అయితే పెళ్లి విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
సరోగసీ ద్వారా కవలలు
మరోపక్క నయన్ బిజినెస్ వ్యవహారాలను కూడా విగ్నేషే చక్కబెడుతున్నట్టు కోలీవుడ్ మీడియా వర్గాలు ఎప్పుడూ చెబుతుంటాయి.గతేడాది జూన్ 9న డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి దగ్గరి బంధువులను, స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో సూర్య, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులు హాజరయ్యారు.అయితే పెళ్లయిన నాలుగు నెలలకే.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. వారి కాళ్లను ముద్దాడుతున్నట్టుగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అప్పుడే వారి పేర్లను ఉయిర్, ఉలగం అంటూ విఘ్నేష్ తెలియజేశారు.ఇది ఇలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నయనతార తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.తనకు, తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.కాగా మొన్నటికీ మొన్న పిల్లలతో కలిసి వెకేషన్ వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇక పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై నయనతార ఎక్కువగా దృష్టి పెట్టారు.

ప్లాస్టిక్ సర్జరీ
కెరీర్ స్టార్టింగ్ లో నయనతార ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో వీటిపై వివరణ ఇచ్చింది.’ నాకు కనుబొమ్మలు అంటే చాలా ఇష్టం. వాటి షేప్ ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఎంతో సమయాన్ని దానికోసం పెడతాను. కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా నా ముఖం కాస్త మారినట్లు అనిపిస్తుంది. బహుశా అందుకేనేమో ప్రజలు అలా అనుకుంటున్నారు. అయితే వాళ్లు మాట్లాడుకునేది నిజం కాదు. డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావొచ్చు.
ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తాయి. మరోసారి అవి లోపలికి పోయినట్లు అనిపిస్తాయి. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు. నా బాడీలో ఎక్కడ ప్లాస్టిక్ ఉండదు..’ అని చెప్పుకొచ్చింది. దీంతో నయన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నయనతార ప్రస్తుతం తమిళ్, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. గత ఏడాది మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ హీరోయిన్ ఈ ఏడాది మొత్తం ఐదు సినిమాలు చేస్తోంది.
Also Read : దేవిశ్రీ ప్రసాద్ మొత్తం ఆస్తులు ఎన్ని కొట్లో తెలుసా ..
నయనతార భారీగా ఆస్తులు..
నిజానికి లగ్జరీ లైఫ్ లో వాడే ప్రతీ వస్తువూ.. కాస్ట్లీది.. లగ్జరీ వస్తువులు చాలానే ఉన్నాయి. దుస్తుల నుండి బ్యాగ్ వరకు అన్నీ విలాసవంతమైనవే. అయితే అందులో ఆమె వాచీ ప్రస్తుతం చాలా స్పెషల్ గా నిలుస్తోంది.. ఎందుకంటే ఆమె ధరించిన వాచీ రోలెక్స్ ఆయిస్టర్ పర్మనెంట్ బ్రాండ్. లగ్జరీ వాచీలు అమ్మె వెబ్ సైట్ ప్రకారం నయనతార పెట్టుకున్న రోలెక్స్ వాచ్ ధర 50 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో కూడా మోడల్ బట్టి ధరలో మార్పు ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే నయన్ వాచ్ 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ ఉండే అవకాశం ఉంది.అగ్ర కథానాయిక నయనతార ఆస్తుల విలువ సుమారు 200 కోట్లు ఉంటుందని ఓ అంచనా.
ఇందులో పలు నగరాల్లో సొంత అపార్ట్ మెంట్లు విల్లాలు- స్థలాలు- కార్లు- ప్రయివేట్ జెట్- క్యాష్ వగైరా ఉన్నాయి. ఒక్కో సినిమాకి సుమారు 8 కోట్ల పారితోషికం అందుకుంటూ ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తూ 18ఏళ్ల ప్రయాణంలో నయనతార ఇంత పెద్ద ఆస్తిని ఆర్జించారనేది ఒక విశ్లేషణ. వాణిజ్య ప్రకటనల ఆదాయం దీనికి అదనం. అయితే తనకు కొన్ని ఫిక్స్ డ్ అస్సెట్స్ కూడా ఎంతో విలువైనవి ఉన్నాయి.ఖరీదైన కార్లు గ్యారేజీలో ఉన్నాయి.యనతార ఖరీదైన BMW X5 యజమాని. ఈ స్వాంకీ కార్ ధర 75.21 లక్షలు. నయనతారకు ఆడి క్యూ 7 కూడా ఉంది.
ఈ రోడ్ రేంజర్ అంచనా వ్యయం సుమారు రూ .80 లక్షలు.తమిళనాడు నుండి ముంబై వరకు విస్తరించి ఉన్న నాలుగు విభిన్న ఆస్తులలో ఆమె రూ. 100 కోట్ల విలువైన స్వగృహాన్ని నయన్ కలిగి ఉంది. ప్రస్తుతంతన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి 4 BHK విల్లాలో నివసిస్తోంది.దీని విలువ భారీ మొత్తంలో ఉంటుంది. ఈ ఇంటి విలువ రూ. 100 కోట్లు. ఈ విలాసవంతమైన నివాసం ఒక ప్రైవేట్ సినిమా హాల్, స్విమ్మింగ్ పూల్, వ్యాయామశాల వంటి ప్రత్యేక సౌకర్యాలను కలిగి ఉంది.యుఎఇకి చెందిన ఆయిల్ కంపెనీ సహా వివిధ వ్యాపార సంస్థలలో వాటాలను కలిగి ఉందని సమాచారం. ఈ బ్యూటీకి ప్రైవేట్ జెట్ కూడా ఉందట.తన భర్త విఘ్నేష్‌తో కలిసి నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ బ్యానర్‌కు సహ యజమానిగా సినిమాలను నిర్మిస్తున్నారు.

నయనతార -విగ్నేశ్ విడాకులు
నిజానికి విగ్నేశ్ కి పెద్దగా ఆస్తులు లేవు . మొత్తం నయనతారనే సంపాదించింది ,అయితే నయనతార పెళ్లి తర్వాత తన సర్వస్వం తన భర్త అంటూ తన ఆస్తులు మొత్తం విగ్నేష్ పేరు మీదటకు మార్చేసిందట . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా నయనతార మళ్ళీ తన ఆస్తులను మొత్తం తన పేరుకే షిఫ్ట్ చేసుకుందట .దీంతో మరొకసారి నయనతార -విగ్నేశ్ విడాకుల వార్త ట్రెండ్ అవుతుంది.
వీళ్ళ మధ్య ఏదో ఇష్యూస్ మొదలయ్యాయి అని .. అందుకే ఇలాంటి బిహేవియర్ బిహేవ్ చేస్తున్నారు అని ఫ్యాన్స్ కి రకరకాల డౌట్లు పుట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.‘జవాన్’ సినిమాలో షారూఖ్ ఖాన్ పక్కన మెరిసిన నయనతార ఇండియాలోనే అత్యంత ధనికులైన నటీమణుల్లో ఒకరట. కొన్ని నివేదికల ప్రకారం 38 ఏళ్ల నయనతార 50 సెకన్ల యాడ్ కోసం రూ.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తారట. మీరు విన్నది నిజమే.
నయనతార ఒక యాడ్ లో కనిపించినందుకు రూ.4 నుంచి రూ.7 కోట్ల రూపాయలు తీసుకుంటారట. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరైన నయనతార ఆస్తులు రూ.200 కోట్లకు పైమాటే అట. ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నశిల్పాశెట్టి, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ వంటి నటీమణుల్లో నయనతార కూడా ఉన్నారు. నయన్ దగ్గర రూ.50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది.
Also Read : త్రిష పర్సనల్ లైఫ్ గురించి ఇది మీకు తెలుసా ..
అలా ఎవరు చేయొద్దు
హీరోయిన్ల సోషల్ మీడియా అకౌట్స్‌ను హ్యాక్ చేసి రకరకాల పోస్టులు చేస్తున్నారు. దీంతో తమ అకౌంట్స్ హ్యాక్ అయినట్లు అధికారింగా ప్రకటించే రోజులు వచ్చాయి. తాజాగా అందాల తార నయనతారకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.నయనతార ఎక్స్ ఖాతా హ్యాక్‌కి గురైనట్లు అధికారికంగా ప్రకటించింది. ‘దయచేసి ఆ అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు కానీ, ట్వీట్లకు కానీ ఎవరూ స్పందించొద్దు.
నా అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయంపై సైబర్ పోలీస్‌లకు కంప్లయింట్ చేశా. త్వరలోనే మళ్లీ మీ ముందుకొస్తా’ అని తెలిపింది. ఈ విషయాన్ని ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించింది. నయనతార కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ ప్రస్తుతం టెస్ట్, తని ఒరువన్-2, మన్నన్‌గట్టి 1960, డియర్ స్టూడెంట్స్ సినిమాలతో బిజీగా ఉంది. నయనతార చివరిగా 2023లో వచ్చిన అన్నపూరణి అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.