SVSC | బాక్స్ ఆఫీస్ లో దుమ్ములేపిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’

Written by admin

Published on:

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

SVSC | వెంకటేష్ – మహేష్ బాబు హీరోలుగా 2013 లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. భారీ మల్టీస్టారర్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచింది. అప్పట్లోనే ఫ్యామిలీలకు బాగా కనెక్ట్ అయి, పాటలు హిట్ అయి థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేసింది. ఇదిలా ఉండగా.. నిన్న అంటే మార్చి 7న రీ- రిలీజ్ అయ్యింది.అయితే ఈసారి ఫ్యాన్స్ అంతా ఈ సినిమాని ఎగబడి చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని భావిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అన్ సీజన్లో, ఓ రీ- రిలీజ్ సినిమాకి, అదీ క్లాస్ సినిమాకి ఇలాంటి ఓపెనింగ్స్ అస్సలు ఊహించలేదు అనే చెప్పాలి.

SVSC
SVSC

ఒకసారి (SVSC) రీ- రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున 2.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా రెండో రోజున ఆల్ మోస్ట్ 18 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…. ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 95 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 1.10-1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకుని ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపించింది.దాంతో మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 4.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి.

Also Read : Actress Ileana | ఇలియానా జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా ..

రికార్డుల జాతర

దీంతో దిల్ రాజు ప్రెస్ మీట్ ను నిర్వహించి కొన్ని ఆసక్తికర విషయాలు మీడియా వారితో పంచుకున్నరు . వెంకటేష్ (Venkatesh), మహేష్ బాబు (Mahesh Babu) వంటి స్టార్ హీరోలను పెట్టుకుని ఇంత క్లాస్ సినిమా తీశారు ఏంటి? అని కొందరు అభిప్రాయపడితే.. ఇంకొంత మంది ఒక్క మాస్ ఎలిమెంట్ కూడా లేదు అంటూ బి,సి సెంటర్ ఆడియన్స్ పెదవి విరిచారు. అయితే సంక్రాంతి సీజన్ ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది.ఫెస్టివల్ మూడ్ కి తగ్గట్టు సన్నివేశాలు ఉన్నాయని ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని డిస్టింక్షన్లో పాస్ చేశారు. అయితే ఒక 5 ఏళ్ళ తర్వాత ఈ సినిమాని మొదట్లో తిట్టిన ప్రేక్షకులు కూడా ప్రశంసించడం గమనార్హం.

SVSC

సోషల్ మీడియాలో సైతం ఈ సినిమా ఓ క్లాసిక్ అంటూ కొనియాడారు చాలా మంది. నిన్నటి ప్రెస్ మీట్లో దిల్ రాజుని (Dil Raju) కొంతమంది ఈ విషయం పై స్పందించారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రిలీజ్ రోజున చాలా మంది బాగుంది.ఇద్దరి హీరోలతో ఓ కొత్త ప్రయత్నం చేశారు అని ఎక్కువ మంది పొగిడారు. అయితే ఇంకొంతమంది అసలు వెంకటేష్, మహేష్ బాబు.. వంటి హీరోల రేంజ్ సినిమా కాదు అని..! అలాంటి హీరోలని పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీశారేంటి?’ అంటూ నెగిటివ్ గా రియాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారని’ దిల్ రాజు చెప్పారు.

Also Read : Devi Sri Prasad | దేవిశ్రీ లో ఉన్న మంచితనం ఏంటో తెలుసా ..

🔴Related Post

Leave a Comment