Uday Kiran | నిజంగానే ఉదయ్ కిరణ్ ఆప్రేమను కాదని తప్పు చేశారా?

Written by admin

Published on:

Uday Kiran | నిజానికి ఉదయ్‌ కిరణ్‌ ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చారు. ఎంతో కష్టపడి.. పైకి వచ్చారు. వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక టాలీవుడ్‌లో ఎంతో భవిష్యత్తు ఉంటుందని భావించిన ఉదయ్‌ కిరణ్‌ తక్కువ వయస్సులోనే లోకం విడిచి వెళ్ళిపోయారు. నిజానికి ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. బయట నుంచి చూసే వాళ్లకి ఇక్కడ నేము, ఫేము, క్రేజు మాత్రమే కనిపిస్తాయి. కానీ అక్కడి వారు అనుభవించే బాధలు, కష్టాల గురించి పెద్దగా తెలియదు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు.. అక్కడ నుంచి బయటకు రాలేరు.. అక్కడే ఉండి పోలేరు. అవకాశాలు లేక.. సాధారణ జీవితం గడపలేక సతమతమవుతుంటారు.

ఉదయ్‌ తొలి అడుగు

చిత్రం సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈయన మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమా తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీ స్నేహం లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్నటువంటి ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఉదయ్ కిరణ్ సినిమా వస్తుంది అంటే చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలు కూడా తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.

Uday Kiran
Uday Kiran

అంత గొప్ప స్థాయికి ఎదిగినటువంటి ఈయనకు వరుస ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమా చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అక్కడ పోయి అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టాడు ఉదయ్ కిరణ్.అయితే వరుస ఫ్లాప్ లు రావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ ఆందోళల్లో పడింది. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆయనకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.దీంతో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరికి మరణించారు.

ఉదయ్‌ కిరణ్‌ ప్రేమ..

ఉద‌య్ కిర‌ణ్ ఒక సమయంలో టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. కానీ ప్రేమ‌లో బ్రేక‌ప్ లు ఇత‌ర ప‌ర్స‌న‌ల్ కార‌ణాల వ‌ల్ల ఉద‌య్ కిరణ్ సినిమా కెరీర్ పై ఎఫెక్ట్ ప‌డింది. ఆ స‌మ‌యంలోనే ఉద‌య్ కిరణ్ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా ప‌నిచేస్తున్న విషిత ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ త‌ర‌వాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.అయితే సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం ఫ్యామిలీ కార‌ణాల వ‌ల్ల ఉద‌య్ కిర‌ణ్ మాన‌సికంగా కృంగిపోయాడు.

సినిమాల గురించి ఎక్కువ‌గా ఉద‌య్ కిర‌ణ్ బాధ‌ప‌డేవాడ‌ని…ఆషికి 2 సినిమాను ఎక్కువ‌గా చూసేవాడ‌ని భ‌ర్త మ‌ర‌ణం త‌ర‌వాత విషిత చెబుతూ ఎంతో బాధ‌ప‌డింది.అంతే కాకుండా విషిత ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణం త‌ర‌వాత అత‌డి కుటుంబానికి పూర్తిగా దూరం అయ్యింది. కేవ‌లం 13 రోజుల త‌ర‌వాత విషిత త‌మ ఫ్యామిలీకి దూరంగా ఉండ‌టం మొద‌లు పెట్టింద‌ని ఉద‌య్ కిర‌ణ్ సోద‌రి శ్రీదేవి ఓ ఇంట‌ర్య్వూలో తెలిపారు. అంతే కాకుండా ప్ర‌స్తుతం విషిత ఓ ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజ‌నీర్ గా ఉద్యోగం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఇదివ‌ర‌కు ఉద‌య్ కిర‌ణ్ తో క‌లిసి హైద‌రాబాద్ లో ఉన్న విషిత భ‌ర్త మ‌ర‌ణం త‌ర‌వాత ముంబైకి వెళ్లిపోయిన‌ట్టు స‌మాచారం.

బిగ్ బాస్ ఆదిత్య ఓం

ఇండస్ట్రీలో నాకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని తెలిపారు. ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగడం చాలా మంచిదని తెలిపారు. హీరోగా అయితే హీరో పాత్రలలోనే చేయాలి సినిమాలు చేయకపోతే ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తారు. ఒకవేళ సక్సెస్ కాకపోతే సినిమాలు ఎందుకు సక్సెస్ కాలేదని ప్రశ్నిస్తారు. హీరోగా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే మెంటల్ హెల్త్ బాగుండాలని ఆదిత్య ఓం తెలిపారు. ఉదయ్ కిరణ్ ఈ పరిణామాలు తట్టుకోలేకపోయాడు. నాతో రెండు సినిమాలు చేసిన విజయ్ సాయి కూడా ఇలానే సూసైడ్ చేసున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌడ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటే.. మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం, అది లేకుండా ఉండటమంటే చాలా కష్టం అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read :  యాంకర్ ఝాన్సీ భర్త గురించి మీకు తెలుసా ..

ఇంకా ‘‘చిరంజీవి తర్వాత ఆ కుటుంబంలో అన్నీ చూసుకునేది అల్లు అరవింద్‌. దాంతో చిరంజీవి.. ఉదయ్‌ కిరణ్‌ గురించి అల్లు అరవింద్‌తో చర్చించి.. పెళ్లి ఫిక్స్‌ చేసి.. ఫైనల్‌గా అనౌన్స్‌ కూడా చేశారు. దానిపై మేమంతా చాలా సంతోషించాం. ఉదయ్‌ కిరణ్‌ లాంటి మంచి కుర్రాడు చిరంజీవి గారి ఫ్యామిలిలో భాగం అవుతున్నాడని ఆనందపడ్డాం. ఆ తర్వాత ఉదయ్‌ కిరణ్‌ మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నేను అతడితో మాట్లాడి.. ఇది చాలా మంచి మ్యాచ్‌.. జాగ్రత్తగా చూసుకో అని సలహా కూడా ఇచ్చాను’’ అని తెలిపారు.

Uday Kiran
Uday Kiran

ఒక గొప్ప టాలెంట్

కమెడియన్ సునీల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ఉదయ్ కిరణ్, నేను కలిసి చేసిన సినిమాలు చాలా పెద్ద హిట్స్ అయ్యాయి.వాటిలోని పాత్రల ద్వారానే నాకు మంచి పేరు వచ్చింది.ముఖ్యంగా “మనసంతా నువ్వే” సినిమాలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్‌గా నటించిన తర్వాత మంచి గుర్తింపు దక్కింది.ఓ సినిమా షూటింగ్ తీస్తున్న సమయంలో అతనిలోని ఒక గొప్ప టాలెంట్ బయటపడింది.

అదేంటంటే ఉదయ్ కిరణ్ చాలా గ్రేట్ రన్నర్.( Great runner ) అతను చాలా వేగంగా ఉరకడం చూసి నేను షాక్ అయిపోయా.డైరెక్టర్ తేజ “నువ్వు నేను” సినిమా షూటింగ్ సమయంలో 100 మీటర్ పరుగు పందం పెట్టారు.అందులో పోలీస్ అకాడమీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన రియల్ రన్నర్స్‌ను తీసుకున్నారు.ఈ సన్నివేశం సినిమాలో భాగమేమైనా రియల్ గానే ఈ పోటీ జరిగింది అందులో వారందరినీ ఉదయ్‌ కిరణ్ ఓడించాడు.అది చూసినా తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయా” అని తెలిపారు.

Also Read : సొంత ప్రైవేట్ జెట్ ఉన్న టాప్ నయనతార మాత్రమే ..

ఆగిపోయిన సినిమాలు

షాహిద్ క‌పూర్‌, క‌రీనా క‌పూర్ జంట‌గా రూపొందిన బాలీవుడ్ చిత్రం జ‌బ్ వి మిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని అప్ప‌ట్లో అనుకున్నారు. ఇందులో ఉద‌య్ కిర‌ణ్‌, త్రిష‌ను నాయికా నాయిక‌లుగా అనుకున్నారు కానీ ఆ సినిమా ఎందుకో ప‌ట్టాలెక్క‌లేదు. ఇదే సినిమాను త‌మిళంలో ప్రేమిస్తే భ‌ర‌త్‌, త‌మ‌న్నాల‌తో కందేన్ కందాల‌యి గా చిత్రీక‌రించారు. ఈ సినిమా తెలుగులోకి ప్రియ‌.. ప్రియ‌త‌మా పేరుతో డ‌బ్ అయింది.

ఆ తరువాత బాల‌కృష్ణ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో సౌంద‌ర్య కీల‌క పాత్ర‌లో న‌ర్త‌న‌శాల సినిమా తీయాల‌ని అనుకున్నారు. కానీ అక‌స్మాత్తుగా సౌంద‌ర్య మ‌ర‌ణించ‌డంతో ఈ సినిమా అర్థంత‌రంగా ఆగిపోయింది. ఈ సినిమాలో అభిమాన్యుడి పాత్ర కోసం ఉద‌య్‌కిర‌ణ్‌ను అనుకున్నారు.దానితో పాటు అంజ‌నా ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌, అసిన్ జంట‌గా ఒక సినిమా తీయాల‌ని అనుకున్నారు. కానీ అప్ప‌టి ప‌రిస్థితుల దృష్ట్యా ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు.చిరంజీవే గాడ్ ఫాదర్

అయితే చిరంజీవి పెద్ద కూతురుతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. దీంతో చిరంజీవి కావాలని ఉదయ్ కిరణ్ ని తొక్కేసాడని, సినిమా ఛాన్సులు రాకుండా చేసాడని పలువురు వ్యాఖ్యానించారు, విమర్శలు చేసారు. ఇప్పటికి కొంతమంది చిరంజీవి అంటే గిట్టని వాళ్ళు ఇదే విషయం గురించి మాట్లాడతారు.ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి ఉదయ్ కిరణ్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. చిన్నప్పుడు ఓ ఈవెంట్లో ఆయన్ని కలిస్తే చాలా ఎగ్జైట్ అయ్యాడు. సినిమాల్లోకి వచ్చాక చిరంజీవి ఉదయ్ కి సపోర్ట్ చేసారు. ఉదయ్ కిరణ్ కి చిరంజీవి గాడ్ ఫాదర్ లాగా ఉండేవారు. సినిమాల గురించి కూడా ఉదయ్ చిరంజీవితో చర్చించేవారు. ఉదయ్ ఇప్పుడు లేడు. జరిగిందేదో జరిగింది. దానికి నేనెవర్ని తప్పుపట్టను. వాటి గురించి ఉదయ్ లేకపోయినా మాట్లాడటం బాధగా ఉంటుంది. కానీ చిరంజీవి గారు ఉదయ్ కి చాలా సపోర్ట్ ఇచ్చారు అని తెలిపింది.

ఉదయ్ కిరణ్ చేసిన తప్పు..


ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే నటి అనితను ప్రేమించారట ఇలా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతూ ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈయన తన ప్రేమకు బ్రేకప్ చెప్పారని తెలుస్తుంది. నువ్వు నేను సినిమాలో కలిసినటువంటి వీరిద్దరూ ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారట.అప్పుడప్పుడే కెరియర్లో ముందుకు వెళ్తున్న (Uday Kiran) ఈయన ప్రేమ అంటూ కెరియర్ ను నాశనం చేసుకోలేక ఆమెను దూరం పెట్టారట. దీంతో అనిత కూడా తనకు దూరమయ్యారు. ఇలా వీరిద్దరికీ బ్రేకప్ కనుక కాకపోయి ఉంటే ఉదయ్ కిరణ్ కెరియర్ మరోలా ఉండేదని ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రస్తుత హీరోలను మించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేవారు అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.

ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ (Ram Gopal Varma) సినిమాల గురించి ప‌త్యేక ప‌రిచ‌యం అవ‌సరం లేదు. ఆయ‌న ఏం చేసినా వివాదమే. సినిమాల కోసం ఆయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటాయి.త్వరలో దివంగ‌త టాలీవుడ్ న‌టుడు ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్‌ను రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించునున్నట్లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే దీనికి సంబంధించి గ్రౌండ్ వ‌ర్క్ కూడా వ‌ర్మ టీమ్ మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. త‌న‌కంటూ ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు హీరో ఉదయ్ కిరణ్.

Uday Kiran
Uday Kiran

సూప‌ర్ హిట్ సినిమాలు..

ఉద‌య్ కిర‌ణ్ టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరో అనే చెప్పాలి. కెరీర్ మొద‌ట్లోనే ఎన్నో హిట్ సినిమాలు చేశారు ఆయ‌న‌. త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సైతం.. ఆయ‌న సినిమాలు చేశారు. కానీ అక్కడ పెద్ద హిట్లు అందుకోలేకపోయారు. అతని మొదటి మూడు చిత్రాలు, ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజ‌యం సాధించాయి. అతనికి “హ్యాట్రిక్ హీరో” అనే బిరుదును సంపాదించిపెట్టాయి. మూడు చిత్రాలు, అన్నీ ప్రేమకథలు చేయ‌డంతో అతనికి ‘లవర్ బాయ్స్’ అనే ఇమేజ్‌ని సంపాదించిపెట్టాయి. అలా కెరీర్ లో దూసుకుపోతున్న టైంలో.. ఒక్క‌సారిగా సినిమాలు వ‌రుస ఫ్లాప్ లు అయ్యాయి.

🔴Related Post

Leave a Comment