Anchor Jhansi | యాంకర్ ఝాన్సీ భర్త గురించి మీకు తెలుసా ..

Written by admin

Published on:

Anchor Jhansi | ఝాన్సీ .. బుల్లి తెరపై వచ్చిన ఫేమ్ తో వెండి తెరపై అడుగుపెట్టింది. ‘ఎగిరే పావురమా’ అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. ఇటీవల నారప్ప, వాల్తేరు వీరయ్య, ఎఫ్ 2, మల్లేశం వంటి పలు సినిమాలతో తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది యాంకర్ ఝాన్సీ. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ‘తులసి’ సినిమాలో ‘కోకాపేట కనకం’ అనే పాత్రలో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నటించి నేటికీ గుర్తుండిపోయేలా చేసింది.తెలంగాణ లాంటి ప్ర‌త్యేక‌మైన యాస‌లో డైలాగ్స్ చెప్ప‌డం ఝాన్సీ ప్ర‌త్యేక‌త‌.అయితే.. ఝాన్సీ తన సినీకెరీర్ ను ఎంతో సక్సెస్ పుల్ గా కొనసాగించిన ఝాన్సీ తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం సాఫీగా కొనసాగించ లేకపోయింది.

యాంక‌రింగ్ ఝాన్సీ గురించి..

నిజానికి ఈరోజుల్లో పదులకొద్దీ చానళ్లు, డజన్ల కొద్ది యాంకర్లు. కానీ అప్పట్లో కేవలం రెండే రెండు చానళ్లు నలుగురు యాంకర్లు అన్నట్లుగా ఉండేది. బుల్లితెర హిట్ షోగా పేరు తెచ్చుకున్న ‘టాక్ ఆఫ్ ది టౌన్’ ప్రోగ్రాం కు యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ ఝాన్సీ. ఆ తరువాత ‘సందడే సందడి’, ‘బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర’,’బ్లాక్’, ‘కో అంటే కోటి’, ‘నవీన’, ‘చేతన’, ‘స్టార్ మా పరివార్’ ఇలా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి బుల్లితెర చిన్న స్క్రీన్ పై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ ఝాన్సీ.యాంక‌రింగ్ చేస్తూనే న‌టిగా కూడా పలు అవ‌కాశాలు అందుకుంటుంది ఝాన్సీ.

Anchor Jhansi
Anchor Jhansi

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఝాన్సీ తన కెరీర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.సాధారణంగా తనని చూస్తే ఎవరైనా పొగరు అని తాను భావిస్తారు నిజానికి నాతో జర్నీ చేస్తే కనుక నా స్వభావం ఏంటో వారికి అర్థమవుతుందని ఝాన్సీ తెలియజేశారు.నన్ను అర్థం చేసుకున్నవారు నాతో పాటు కొన్ని సంవత్సరాల పాటు జర్నీ చేశారు అర్థం చేసుకోలేని వారు కొద్ది రోజులకే నాతో ప్రయాణాన్ని ఆపేసారని తెలిపారు. అయితే ఈమె జోగి నాయుడుని పెళ్లి చేసుకుని తనతో ఏడాదికే విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసింది.

బుల్లి తెర నుండి వెండి తెరకు..

మొదట్లో ప్రముఖ యాంకర్ ఝాన్సీని ప్రేమించి పెళ్లాడాడు జోగి నాయుడు. జెమినీ టీవీలో ప్రోగ్రాం డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో జోగినాయుడు, యాంకర్ ఝాన్సీల మధ్య పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. ఇద్దరికీ ఓ కుమార్తె కూడా ఉంది. అయితే వివాహం అనంతరం ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తడంతో 2014లో విడాకులు తీసుకున్నారు.కాగా ఝాన్సీ యాంకరింగ్‌తో పాటు సినిమాలతో బిజీగా ఉండగా.. జోగి నాయుడు అప్పుడప్పుడూ వెండి తెరపై కనిపించేవారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘మా ఆవిడ మీద ఒట్టు.. మీ ఆవిడ చాలా మంచిది’ అనే చిత్రంతో బుల్లి తెర నుండి వెండి తెరకు పరిచయం అయ్యారు జోగి నాయుడు.

Also read : సొంత ప్రైవేట్ జెట్ ఉన్న టాప్ నయనతార మాత్రమే ..

ఆ తరువాత అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఠాగూర్, వాసు, స్వామిరారా, కార్తికేయ చిత్రాల్లో కనిపించారు.అయితే అప్పటికి వీరిద్దరికి ఒక కుమార్తె జన్మించింది. ఇలా కుమార్తె ఆలనా పాలన చూసుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి ఝాన్సీ తాజాగా రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మొదటిసారి పెళ్లి చేసుకుని ఎన్నో ఇబ్బందులు పడ్డానని, మరోసారి పెళ్లి చేసుకొని ఆ ఇబ్బందులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనని ఈమె తెలియజేసారు. ఇప్పటికైతే తనకు పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు ఏమాత్రం లేవని ఈమె వెల్లడించారు. ఇక నా మనస్తత్వాన్ని అర్థం చేసుకుని తనంతట తానే ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతే తప్పకుండా పెళ్లి గురించి ఆలోచిస్తానని ఈమెతెలిపారు.

15 ఏండ్ల వయస్సులో యాడ్స్..

ఎనిమిది సంవత్సరాల వయసులోనే రేడియో యాంకర్ గా తన కెరీర్ను ప్రారంభించానని చెప్పుకొచ్చింది ఝాన్సీ. తాను పనిచేసిన ఆల్ ఇండియా రేడియోలో 180 రూపాయలను జీతం గా తీసుకున్నానని, ఆ డబ్బులతో తన నాన్న ఒక డిక్షనరీని గుర్తుగా కొనిచ్చారని అది నేటికీ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు. తన కెరీర్ ప్రారంభంలో ఎంతోమంది తనకు చేదోడు వాదోడుగా నిలిచారని ఎన్నో విలువ కట్టలేని పాఠాలను నేర్పారని తెలిపారు యాంకర్ ఝాన్సీ.తన 15 ఏండ్ల వయస్సులో యాడ్స్ లో నటించిన తెలిపారు యాంకర్ ఝాన్సీ.

అలా నటనపై ఇష్టం పెరగడంతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టానని తెలిపారు.యాంకర్ ఝాన్సీ అంటే అసలు ఏంటి అని నా గురించి తెలియాలంటే మీరు గూగుల్‌లో పదో పేజీకో పదిహేనో పేజీకో వెళ్లాలి. టాప్ పర్సనాలిటీ లిస్ట్‌లో ఝాన్సీ కూడా ఉందని వెతుక్కోవడానికి 15 పేజీలోకి వెళ్లాలి. ఝాన్సీకి 8 నంది అవార్డులు వచ్చాయని తెలసుకోవడానికి పదో పేజీలోకి వెళ్లాలి. నేను సమాజానికి చేసిన సేవ గురించి తెలుసుకోవాలంటే ఇంకో 15 పేజీలు వెనక్కి వెళ్లాలి. నిజంగా నేనంటే తెలుసుకోవాలని అనుకునేవాళ్లు.. తవ్వితీసి అలాంటివి చదువుతారు. కానీ.. వాళ్లకి కావాల్సిన చెత్త కోసం వెతుక్కునే వాళ్లు ముందు పేజీల్లోకి వస్తుంది.

Anchor Jhansi
Anchor Jhansi

నా శాపం ఊరికే పోదు..

అయితే తాజాగా ఈ విషయం గురించి ఈమె స్పందించారని అర్థమవుతుంది.ఇకపోతే కెరియర్ గురించి కూడా మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలో ఎంతో క్రెడిట్ అందుకోవాల్సి ఉండగా ఆ క్రెడిట్ తనకు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.24 ఎపిసోడ్లు నేను చేసి చివరి ఎపిసోడ్లో కేక్ కట్ చేయాల్సి ఉండగా ఆ క్షణం తాను అక్కడ ఉండనని తెలిపారు. 100 ఎపిసోడ్లు జరిగిన 99వ ఎపిసోడ్ వరకు నేను యాంకరింగ్ చేసిన 100 వ ఎపిసోడ్ కు అక్కడ ఉండనని అక్కడ ఉండకపోవడానికి కారణాలు కూడా (Anchor Jhansi) తనకు తెలియదని తెలిపారు.

ఒక సమయం లో తనపై ఎలాంటి రూమర్లు క్రియేట్ చేశారు.. ఎవరు తప్పుడు రాతలు రాయించారు.. ఎందుకు రాయించారో తెలియజేస్తూ వెబ్ మీడియాలో తనపై రాసిన చెత్త వార్తల గురించి ప్రస్తావించారు. వాటి వల్ల తాను ఏం కోల్పోయానో చెప్పుకొచ్చారు యాంకర్ ఝాన్సీ. ‘‘నన్ను బాధపెట్టిన వాళ్లకి నా శాపం చాలా గట్టిగా తగులుతుంది.. ఊరికే పోదు. చాలామందికి నా శాపం తగిలే ఉంటుంది.. అది తగిలి వాళ్లు చెప్పాలి. నాతో ఓ సినిమాకి రెండు రోజులు క్యారెక్టర్ చేయించుకుని సడెన్‌గా నన్ను సినిమా నుంచి తీసేసిన వాళ్లకి తెలియాలి నా శాపం గురించి.

Also read : సొంత ప్రైవేట్ జెట్ ఉన్న టాప్ నయనతార మాత్రమే ..

నాగార్జున తో అలాంటి రిలేషన్..

గార్జున‌కు ఇండ‌స్ట్రీలో సొంత ఫ్యామిలీ మెంబ‌ర్స్ లాంటి వాళ్లు కూడా కొంద‌రు ఉన్నారు. వీళ్ల‌లో మ‌హిళా న‌టీమ‌ణులు కూడా ఉండడం విశేషం. వారిద్ద‌రు ఎవ‌రో కాదు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, సీనియ‌ర్ యాంక‌ర్ ఝాన్సీ కావ‌డం విశేషం.లక్ష్మి అంటే చిన్నప్పటినుండే నాగార్జునకు చాలా ఇష్టమట. ల‌క్ష్మి కొన్ని సినిమాల్లో నాగ్‌కు త‌ల్లిగా చేసింది. ఇక యాంక‌ర్ ఝాన్సీని నాగ్ త‌మ ఫ్యామిలీ మెంబ‌ర్‌లాగా చూసుకుంటాడ‌ట‌. ఈ విష‌యాన్ని నాగ్ స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. గ‌తంలో నాగార్జున న‌టించిన చాలా సినిమాల్లో ఝాన్సీ కూడా న‌టించింది. ఇక ఝాన్సీ కూడా నాగ్ ఇంటికి వెళ్ల‌డం, నాగ్‌ను త‌న తోటి కుటుంబ స‌భ్యుడిలానే ట్రీట్ చేయ‌డం చేస్తోంద‌ట‌.

ఈ మద్య యాంకర్ ఝాన్సీ తన మేనేజర్ శ్రీను ఫోటో షేర్ చేస్తూ..శ్రీను.. శీను బాబు అని నేను ముద్దుగా పిలుస్తాను. అతనే ఇన్నేళ్ళుగా నా సపోర్ట్ సిస్టమ్. హెయిర్ స్టైలిస్ట్ కెరీర్ మొదలుపెట్టి నా పర్సనల్ సెక్రెటరీగా మారాడు. నా పనులన్నీ తనే చూసుకుంటాడు. అతనే నా రిలీఫ్, నా బలం. నన్ను బ్యాలెన్స్ గా ఉంచాడు. ఎంతో మంచివాడు. అతడు నా స్టాఫ్ గా కంటే కూడా నా కుటుంబ సభ్యుడిగా, నా సోదరుడిగా ఉన్నాడు. కానీ 35 ఏళ్లకే ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. నాకు మాటలు రావట్లేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

కూతురి ఫోటో

ఇదిలా ఉండగా తాజాగా ఝాన్సీ తన కూతురి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసినటువంటి ఎంతోమంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఝాన్సీ కూతురేంటి ఇంత అందంగా ఉంది.అచ్చం తల్లి పోలికలతో చాలా అందంగా ఉన్నారు అంటూ తన కుమార్తె ఫోటోలపై కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఝాన్సీ కనుక తన కూతురిని ఇండస్ట్రీలోకి పంపిస్తే ఖచ్చితంగా హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటారు అంటూ తన కుమార్తె అందంపై పొగడ్తలు కురిపిస్తున్నారు.

మరికొంతమంది ఈ ఫోటోలపై స్పందిస్తూ మీ కూతురి అందం ముందు హీరోయిన్లు కూడా తేలిపోతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.అయితే తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా గోల్డ్ అండ్ బోల్డ్ అంటూ తన కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈమె ఈ ఫోటోని షేర్ చేసారు.తాజా కోకాపేట రియల్ ఎస్టేట్ ధరల కారణంగా మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఎకరం ధర రూ. 100 కోట్లు డాటడం ఏంటని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు సినిమాలో డైలాగ్ విని నవ్వుకున్నవారు.. ఇప్పుడు అవే మాటలు నిజమయ్యే సరికి ముక్కున వేలేసుకుంటున్నారని సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు కొందరు.

Anchor Jhansi
Anchor Jhansi

మానసికంగా క్షోభకు గురయ్యాను

తాను ఒక ప్రముఖ హీరోతో ఎ*ర్ పెట్టుకున్నారని తనని పోలీసులు కూడా ఈ విషయం పైన అరెస్టు చేశారని ఒక వెబ్సైట్లో పిచ్చి రాతలు రాయడం వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యానని కానీ అలా ఎవరు రాయించారో..ఎందుకు రాయించారో తనకి బాగా తెలుసని.. ఇలాంటి విషయాలు తప్పకుండా దేవుడు గమనిస్తూ ఉంటారు ఏదో ఒక రోజు వాళ్ళు అనుభవిస్తారు అంటూ తెలిపింది.

కానీ నిజా నిజాలు రాసేముందు తెలుసుకొని రాయాలి ఇలాంటి అబాండాలు వేస్తే ఎవరి మనసు అయినా సరే ఇబ్బంది పడుతోంది తనకి కూడా మానసికంగా క్షోభకు గురయ్యాను అంటూ తెలిపింది ఝాన్సీ.ఈ వార్తల వల్ల తను ఒక పదవి కూడా గతంలో కోల్పోయానని తెలిపింది.. గతంలో తనని కర్ణాటక యూనిసెఫ్ తరపున బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని చూసినప్పుడు సరిగ్గా అలాంటి సమయంలోనే ఇలాంటి రూమర్స్ రావడం వల్ల తనకు దక్కాల్సిన ఈ పదవి కూడా రాకుండా పోయిందని తెలిపింది యాంకర్ ఝాన్సీ.

🔴Related Post

Leave a Comment